మళ్లీ ఎక్స్ పోజింగ్ చేస్తా

స్టార్డమ్ ఉన్నప్పుడు ఎన్ని డిమాండ్స్ పెట్టినా నడుస్తుంది. అలాగే నడుస్తుంది కదా ఆ డిమాండ్స్ ను మరీ ఎక్కువ చేసినా అసలుకే మోసం వస్తుంది. అప్పుడు ఉన్నది కూడా పోతుంది. ప్రస్తుతం ఈ సిట్యుయేషన్ లోనే ఉంది సీనియర్ బ్యూటీ నయనతార. ఒకప్పుడు కేవలం స్కిన్ షోతో మాత్రమే పాపులర్ అయిన నయన్ ఆ తర్వాత రెండు బ్రేకప్ లు చేసుకుని అనూహ్యంగా వచ్చే హీరోయిన్ సెంట్రిక్ సినిమాల హిట్లను ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఓ దశలో తన సినిమాలు మీడియం రేంజ్ హీరోల రేంజ్ లో కలెక్ట్ చేశాయి. దీంతో తను కూడా మూడు నాలుగు కోట్లంటూ డిమాండ్స్ మొదలుపెట్టింది. దీంతో పాటు తను సినిమా ప్రమోషన్స్ కు రాదు. మినిమం ఎక్స్ పోజింగ్ కూడా చేయనంటూ చెప్పేసింది. కేవలం యంగ్ హీరోస్ కే ఓకే అన్నా తర్వాత ఆ కండీషన్ సడలించింది. ఇక నిర్మాతలను ఇబ్బంది పెడుతుంది. రెమ్యూనరేషన్ కాకుండా తన పర్సనల్ ఖర్చులు కూడా తడిసిపోతాయి.. వంటి కంప్లైంట్స్ పెరిగాయి. ఇంకేముందీ ప్రస్తుతం సినిమాలు తగ్గాయి. దీంతో మళ్లీ మొదటికే వస్తానంటోందీ కొలమావు కోకిల.
ప్రస్తుతం సినిమాలు తగ్గేసరికి అమ్మడికి తత్వం బోధపడింది. మరోవైపు తమిళ్ సినిమా నిర్మాతలు ఈ మధ్య ఇలా ఇబ్బంది హీరోయిన్లపై కొరడా ఝలిపించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో తను మళ్లీ ఎక్స్ పోజింగ్ చేయడానికి రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తోంది. అంటే అలా అలా కాదు.. ఏకంగా బికినీస్ అయినా మళ్లీ ఓకే అంటోంది. అలాంటి కథలతో ఎవరైనా తనవద్దకు వస్తే చేయడానికి అభ్యంతరం లేదూ అంటోంది. అంతేలే.. ఏ స్క్రిప్ట్ కు ఆ బట్ట కట్టకపోతే హీరోయిన్ల లైఫ్ టైమ్ ఎలా పెరుగుతుంది.

Related Articles

Back to top button
Send this to a friend