మళయాల రీమేక్ లో అన్నదమ్ములు

అన్నదమ్ములిద్దరూ ఇండస్ట్రీలో ఉంటే అదో స్పెషల్. ఆ ఇద్దరూ స్టార్డమ్ తెచ్చుకుంటే స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి ఇద్దరూ కలిసి ఒకే తెరను పంచుకుంటే చూడాలని వారి అభిమాని కాని వాల్లు సైతం కోరుకుంటారు. అయితే ఫ్యాన్స్ తప్ప హేటర్స్ లేని స్టార్స్ ఎవరైనా ఉంటే అది సూర్య అండ్ కార్తి. యస్.. ఈ ఇద్దరికీ భారీ ఫ్యాన్స్ లేకపోయినా హేటర్స్ మాత్రం ఉండరు. ఇద్దరూ ప్రయోగాలు చేస్తారు. వాటితోనే ప్రత్యేకమైన ఇమేజ్ ను తెచ్చుకున్నారు. ఇద్దరికీ తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ అన్నదమ్ములు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారనే వార్త కోలీవుడ్ లో హాల్చల్ చేస్తోంది. అయితే ఆ సినిమా ఓ రీమేక్. మళయాలంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా. వీరికి ఉన్న ఇమేజ్ లతో పోలిస్తే ఆ సినిమా వీళ్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ గ్యారెంటీ. అలా ఉంటుందా మూవీ.
మళయాల స్టార్ హీరో పృథ్విరాజ్ కుమరన్, బిజు మీనన్ నటించిన ‘అయ్యప్పనం కోషియం’అనే సినిమా అక్కడ ఈ యేడాది వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్ చేయాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఎవరు చేస్తారనే విషయంలో క్లారిటీ లేదు. కానీ తమిళ్ లో ఏకంగా సూర్య, కార్తిల పేర్లు తెరపైకి రావడం విశేషమనే చెప్పాలి. నిజానికి వీళ్లు కూడా ఎప్పటి నుంచో కలిసి నటించేందుకు ఓ మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు. ఈ కథ వారికి బాగా సూట్ అవుతుది. ఇద్దరూ మంచి ఆర్టిస్టులు కూడా కావడంతో మరింత ప్లస్ అవుతుంది. ప్రస్తుతం రూమర్ గా వినిపిస్తోన్న ఈ వార్త నిజం కావాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు. నిజంగా రీమేక్ చేస్తే తెలుగులోనూ ఆ సినిమాకు మంచి క్రేజ్ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు.
మొత్తంగా ప్రస్తుతం అన్నదమ్ములిద్దరూ వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.

Related Articles

Back to top button
Send this to a friend