మందుబాబుకు షాక్ ఇచ్చిన కేరళ హై కోర్ట్ ..

మందులో వేశాడో మత్తులో వేశాడో కానీ కేరళలో ఓ మందు బాబు హైకోర్ట్ లో ఓ పిటిషన్ వేశాడు. దాన్ని పరిశీలించిన కోర్ట్ ఏకంగా అతనికి యాభై వేలు జరిమానా విధించింది. ఓ వైపు కరోనా ఎఫెక్ట్ తో దేశమంతా అల్లాడుతోంది. రద్దీగా ఉండే అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఎవరైనా ఓపెన్ చేసినా జనాలు వెళ్లే పరిస్థితి లేదు. మందు లేని కరోనాను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ అహర్నిశలు కష్టపడుతోంటే.. కేరళలో ఓ మందు బాబు మాత్రం తనకు ఆన్ లైన్ లో మద్య సప్లై చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్ట్ లో పిటిషన్ వేశాడు.
అయితే ఇందులో ఆ వ్యక్తితో పాటు, అలాంటి వ్యక్తుల స్వార్థం తప్ప సామాజిక ప్రయోజనం ఏం లేదని.. దేశమంతా విపత్కర పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి టైమ్ వేస్ట్ పిటిషన్స్ వేసినందుకు గానూ జ్యోతిష్ అనే ఆ వ్యక్తికి యాభై వేల రూపాయల జరిమానా విధించింది కోర్ట్. దీంతో పాపం ఆ బాబుకు మొత్తం దిగిపోయింది. ఇప్పటికే కేరళ వైన్ షాప్ ల ముందు సోషల్ డిస్టన్స్ ను పాటిస్తూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా లైన్ లో నిలబడి మందు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఈ జ్యోతిష్ అనే వ్యక్తి మాత్రం ఆన్ లైన్ లో మద్యం అమ్మేలా ప్రభుత్వాన్నే ఆదేశించాలని కోరడం విడ్డూరం. అంతేలే ఎవడి కష్టాలు వాడివి.

Related Articles

Back to top button
Send this to a friend