మంచు విష్ణు తో మళ్ళి ఢీ రూమర్

ఒకప్పుడు ఒకే ఫార్మాట్ లో అనేక సినిమాలు తీసి లక్ కొద్దీ విజయాలు సాధించాడు శ్రీను వైట్ల. కానీ ఆ ఫార్మాట్ కు కాలం చెల్లిన తర్వాత కూడా అదే పనిగా అవే సినిమాలు చేసి జనాన్ని భయపెట్టాడు. వరుసగా డిజాస్టర్స్ వస్తున్నా కూడా ఆ మూస లో నుంచి బయటకు రాలేక పోయాడు. దీంతో నిర్మాతలే కాదు హీరోలు సైతం శ్రీను అంటేనే సైడ్ చేసారు. ఐతే ఇదే చివరి అవకాశం అని అంత అనుకున్న టైమ్స్ లో కూడా అతను ఏ మాత్రం కొత్తదనం చూపించలేకపోయాడు. ఈ కారణంగానే మనోడు పూర్తిగా షేడ్ అవుట్ అయిపోయాడు. ఐతే ఒకప్పుడు తనకు అస్సలు హిట్టే లేని టైం లో శ్రీను వైట్ల ఢీ అంటూ ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మంచు విష్ణు కి.ఇప్పుడు దానికి కృతజ్ఞత తీరేంచుకోబోతున్నాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇది అంట సులువు కాదు అనే చెప్పాలి.
మంచు విష్ణు ఇప్పుడు మోసగాళ్లు అనే ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నాడు. తర్వాత భక్త కన్నప్ప తో పాన్ ఇండియన్ మూవీ ప్లాన్ చేసుకున్నాడు. ఈ రెండు పూర్తి అయ్యేసరికి మరో రెండేళ్లు పడుతుంది. ఈ లోగ మరో హీరో ఛాన్స్ ఇవ్వక పోతే శ్రీను పూర్తిగా మరుగున పడతాడు. అదే టైం ఈ రెండు సినిమాలతో విష్ణు విజయాలు అందుకుంటే ఖచ్చితంగా మల్లి శ్రీను ని పట్టించుకోడు. సో ఈ ఢీ కొట్టడం వంటి రూమర్స్ క్రియేట్ చేయకుండా శ్రీను ఇప్పటికైనా ఓ మంచి కథతో ప్రయత్నాలు చేయడం మంచిది.

Related Articles

Back to top button
Send this to a friend