బేస్ క్యాంప్ గా అన్నపూర్ణ స్టూడియోస్


కరోనా తో ఎదురవుతున్న ఇబ్బందులు ఎన్ని ఉన్నా మనిషి మనిషి ఎప్పుడూ అండగా ఉంటాడు అని అనేక మంది నిరూపిస్తున్నారు.ఎంతో పెద్ద మనసు తో ముందు కు వచ్చి పేదలకు ఆర్ధిక సాయం అందించే వారు కొందరైతే, నిత్యం అవసరం అయ్యే సరుకులు,మందులు పంపణీ చేస్తున్నవారు మరికొందరు.ప్రత్యేకించి సెలబ్రిటీ లు కూడా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తూ ఉన్నారు..చిరంజీవి నేతృత్వం లో ఏర్పాటైన CCC కి కూడా భారీగా విరాళాలు అందాయి.ఇప్పటికే ఆ డబ్బు తో నిత్యావసరాల పంపిణీ కూడా వేగం గా జరుగుతోంది.నాగార్జున కూడా ఇందులో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.ఇప్పటికే సిసిసి సాంగ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.అంతేకాకుండా కార్మికులకు అందించే సరుకులను,కూరగాయల్ని భద్రపరిచి ,ప్యాకింగ్ చేసి పంపిణీ చేసేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ ను బేస్ క్యాంప్ గా ఉపయోగిస్తున్నారు.ఈ విషయాన్ని నాగార్జునే స్వయం గా ట్విట్టర్ లో తెలిపారు.సరుకుల ప్యాకింగ్,పంపిణీ లో సహకరిస్తున్న 50 మంది మెహర్ బాబా ట్రస్ట్ వాలంటీర్ లకు,డైరెక్టర్ మెహర్ రమేష్,యన్.శంకర్ లకు వారి టీం కు ధన్యవాదాలు తెలిపారు నాగార్జున.సాయం చేయాలనే మనసు,ఆలోచనా ఉంటే అది ఏ రూపం లో అయినా చేయవచ్చు కదా.

Related Articles

Back to top button
Send this to a friend