బిగ్ న్యూస్ – సంక్రాంతి నుంచి ఆర్ఆర్ఆర్ అవుట్ ..?

బాహుబలి వంటి ఎపిక్ మూవీ తర్వాత రాజమౌళి రూపొందిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్ కు ఆది నుంచి అనేక కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ ఎన్నో ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తూ వస్తోందీ సినిమా. లేటెస్ట్ గా హీరోయిన్ అలియా భట్  కూడా తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి. ఇక మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ భారీ ప్రభావం చూపించింది. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆగిపోయింది. మార్చి 31 తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. ఈలోగా కరోనా ఇంకా ప్రబలితే ఆ డేట్ మరింత పొడిగిస్తారు. దీంతో ఈ సినిమా విడుదల డేట్ కూడా మారబోతోందనే వార్తలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి.
నిజానికి ఆర్ఆర్ఆర్ ను ఈ యేడాది జూలై 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పటి వరకూ అయిన లేట్ కారణంగా ఏకంగా వచ్చే యేడాది సంక్రాంతి బరిలో 2021 జనవరి 8న విడుదల చేస్తాం అని ప్రకటించారు. కానీ తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఈ మూవీ సంక్రాంతికి విడుదల కావడం అసాధ్యం అంటున్నారు. అంటే 2021 వేసవిలో విడుదలయ్యే అవకాశం ఉందట.
మొత్తంగా ఇప్పుడు కొత్త హీరోయిన్ ను వెదుక్కోవాలి. మళ్లీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేరు. అందుకే వచ్చే జనవరి 8న విడుదల కావడం అసాధ్యం అని తేలిపోయింది. ఈ కారణంగా ఈ బిగ్ మూవీ సంక్రాంతిని మిస్  చేసుకుంటున్నట్టే అంటున్నారు. మరి ఈ వార్తలపై ఆర్ఆర్ఆర్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend