బాలయ్య అన్నంత పనీ చేస్తున్నాడు

నందమూరి బాలకృష్ణ .. తన సినిమాల రిజల్ట్స్ తో పనిలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. 2018 నుంచి బాలయ్యకు ఓ రేంజ్ లో బ్యాడ్ పీరియడ్ నడుస్తోంది. అయినా ఇప్పటికే బోయపాటితో సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్ట్ లు రెడీ చేసుకున్నాడు. బోయపాటి డైరెక్షన్ లో సినిమా రీసెంట్ గా ప్రారంభం అయింది. ఇందులో బాలయ్య డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు. ఒకటి అఘోరా పాత్ర అని చెబుతున్నారు. ఈ మేరకు తన లుక్ ను కూడా పూర్తిగా ఛేంజ్ చేసుకుంటన్నాడు బాలయ్య. అయితే కొన్ని రోజులుగా ఆయన ఓ వెటరన్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. అది నిజమే అంటు్నాయి లేటెస్ట్ సోర్సెస్..
ఒకప్పుడు బాలయ్యను మాస్ హీరోగా నిలబెట్టడంలో బ్యాక్ బోన్ గా ఉణ్న దర్శకుడు బి గోపాల్. గోపాల్ సినిమాలతోనే అప్పటి వరకూ ఫ్యామిలీ హీరోగా ఉన్న బాలయ్యకు మాస్ ఇమేజ్ వచ్చింది. వీరి కాంబోలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బిగ్గెస్ట్ హిట్స్ వచ్చాయి. అలాగే పల్నాటి బ్రహ్మనాయుడు వంటి డిజాస్టర్ కూడా ఉంది. ప్రస్తుతం బి గోపాల్ ఫేడవుట్ అయిపోయాడనే చెప్పాలి. ఈ టైమ్ లో మళ్లీ ఆయనకు తన సినిమా ఇస్తున్నాడంటే ఖచ్చితంగా కథపై నమ్మకమే అని చెప్పాలి.
పరుచూరి బ్రదర్స్ అందించిన ఈ కథతో బి గోపాల్ డైరెక్షన్ లో సినిమా బాలయ్య బర్త్ డే రోజున అంటే జూన్ 10న అఫీషియల్ గా ప్రారంభం అవుతుందట. దీన్ని బట్టి వచ్చే యేడాది రెండు సినిమాలు విడుదల చేస్తాడు బాలయ్య. ఏదేమైనా ఇప్పుడాయన బి గోపాల్ కు ఛాన్స్ ఇవ్వడం కరెక్టా కాదా అనేది అప్రస్తుతం. ఎందుకంటే ఏ స్క్రిప్ట్ లో ఏ హిట్ ఉందో ఎవరికి తెలుసు.

Related Articles

Back to top button
Send this to a friend