బాలయ్యతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్

నందమూరి బాలకృష్ణ .. కెరీర్ ఆరంభంలో మనోడికి మాస్ ఇమేజ్ అంతగా లేదు. ఆయనకు ఉన్న పెద్ద విజయాలన్నీ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించే కుర్రాడి వేషాలే. కానీ అప్పటికే చిరంజీవి మాస్ ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. అతనితో పోటీ పడేంత మాస్ ఇమేజ్ అయితే అప్పుడు బాలయ్యకు లేదనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే దర్శకుడు బి గోపాల్ ఎంటర్ అయ్యాడో ఆ తర్వాత బాలయ్య రేంజ్ కూడా మారిపోయింది. ఆ నలుగురు అనే లీగ్ లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వడం మొదలైంది బి గోపాల్ సినిమాల తర్వాతే. వీరి కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ లారీ డ్రైవర్. ఇప్పటికీ మాసివ్ గా అనిపిస్తుంది. ఇక అంకుశం తర్వాత ఆ స్ఫూర్తితో వచ్చి రౌడీ ఇన్స్ పెక్టర్ బాలయ్యలోని సిసలైన మాస్ కోణాన్ని ఆవిష్కరించింది. అలాగే తెలుగు సినిమా ట్రెండ్ ను మార్చివేసిన సమరసింహారెడ్డి సినిమా గురించి కొత్తగా చెప్పేదేముందీ. అలాగే నరసింహనాయుడు.. బాలయ్యకు తొలి నందిని తెచ్చిన సినిమా. ఇవన్నీ బాలయ్యను మెగాస్టార్ కు స్ట్రాంగ్ కాంపిటీటర్ గా మార్చిన సినిమాలే. అయితే అతనిలో ఈ మాస్ యాంగిల్ ను తొలిగా ఆవిష్కరించిన దర్శకుడు బి గోపాలే. కాకపోతే వీరి కాంబోలో చివరి సారిగా వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు దారుణంగా డిజాస్టర్ అయింది. అంత మాత్రాన బి గోపాల్ ను తక్కువ అంచనా వేయలేం.
ప్రస్తుతం బాలయ్య బాగా స్లంప్ లో ఉన్నాడు. బోయపాటి శ్రీను తో చేస్తోన్న సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ తో సినిమా ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. అటుపై 107వ సినిమాను మళ్లీ బి గోపాల్ డైరెక్ట్ చేస్తాడనే వార్తలు టాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి. అందుకు కారణం.. ఇప్పుడు గోపాల్ అస్సలు ఫామ్ లో లేడు. చివరి సారిగా వచ్చిన మస్కా మాత్రం ఓకే అనిపించుకుంది. అంతే కానీ ఆయన ఈ ట్రెండ్ కు సరిపోతాడా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. బట్.. మంచి కథ పడితే దాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లే సత్తా గోపాల్ లో పుష్కలంగా ఉంది. అందువల్ల ముందు మంచి కథ రాయించుకుంటే అప్పుడు ఈ కాంబినేషన్ మళ్లీ మెస్మరైజ్ చేసినా ఆశ్చర్యం లేదు.

Related Articles

Back to top button
Send this to a friend