ఫిబ్రవరి 27న ఏప్రిల్ 28 ఏం జరిగింది

ఫిబ్రవరి 27న ఏప్రిల్ 28 ఏం జరిగింది విడుదల

April 28 emi jarigindi
రంజిత్, షెర్రీ అగర్వాల్ జంటగా వీజీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వీరాస్వామి.జి స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఏప్రిల్ 28న ఏం జరిగింది. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ మా చిత్రం ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌తో మరింత ఉత్కంఠను పెంచింది.వినాయక్ గారికి మా ట్రైలర్ నచ్చడంతో పాటు సినిమా విజయం సాధించాలని మాకు ఆల్‌దిబెస్ట చెప్పడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఓ వినూత్నమైన కథతో ఎవరూ అంచనా వేయలని ట్విస్ట్‌లతో రూపొందుతున్న మా చిత్రం ప్రతి మలుపు ఆసక్తికరంగా థ్రిల్లింగ్‌గా వుంటుంది. ముఖ్యంగా చిత్రంలోని ఇంటర్వెల్ బ్యాంగ్, పతాక సన్నివేశాలు ఎవరూ ఊహించని రీతిలో షాకింగ్‌గా వుంటాయి. థ్రిల్లర్ జోనర్‌లో ఇటువంటి కాన్సెప్ట్‌తో ఇప్పటి వరకు ఏ చిత్రం రాలేదు. ఈ నెల 27న విడుదల కానున్న మా చిత్రం  తప్పకుండా చిత్రం అందరి ప్రశంసలు అందుకుంటుంది అన్నారు. అజయ్, రాజీవ్ కనకాల, తనికెళ్ల భరణి, చమ్మక్ చంద్ర, తోటపల్లి మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్ జక్కా.

Related Articles

Back to top button
Send this to a friend