ప్ర‌శాంతతోనే భ‌విష్య‌త్: ఉపాస‌న

Will only look back at the good times.Made peace with the present. Waiting to embrace a positive future. #throwback #throwbackthursday

Upasana Konidela यांनी वर पोस्ट केले बुधवार, ६ मे, २०२०

మెగా కోడలు ఉపాసన కొణిదెల లైఫ్ స్టైల్ గురించి తెలిసిందే. అపోలో లైఫ్-అపోలో ఫౌండేష‌న్ అధినేతగా అభిమానుల‌కు నిరంత‌రం యూట్యూబ్ వేదికగా అవేర్ నెస్ పెంచుతున్నారు. ఈ వేదిక‌పై ఫిట్‌నెస్ సలహాలు ఇస్తూ బోలెడంత ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ కి సంబంధించిన వ్య‌వ‌హారాల‌తో పాటు సినిమాల సంగ‌తుల్ని ముచ్చ‌టిస్తూ మెగా ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉన్నారు. సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో ఇప్ప‌టికే ల‌క్ష‌ల్లో అభిమానులు త‌న‌ని అనుస‌రిస్తుండ‌డం ఆస‌క్తికరం.
హైద‌రాబాద్ లో ఉన్న బెస్ట్ మ‌హిళా ఎంటర్ ప్రెన్యూర్స్ లో ఒక‌రిగా ఉపాస‌న గౌర‌వం అందుకుంటున్నారు. ఇంత‌కుముందు ప‌లు గ్లోబ‌ల్ స‌మ్మిట్ కార్య‌క్ర‌మాలు.. పారిశ్రామిక వేత్త‌ల స‌మావేశాల్లో అద్భుత‌మైన స్పీచ్ ల‌తో ఆక‌ట్టుకున్నారు. ప‌లు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పైనా ఉపాస‌న గౌర‌వం అందుకున్నారు. విలువ‌ల‌తో కూడుకున్న ఆరోగ్య‌వంత‌మైన స‌మాజ స్థాప‌న‌కై త‌న ప్ర‌య‌త్నం యువ‌త‌రంలో ప్ర‌తిసారీ స్ఫూర్తిని నింపుతోంది. బిల్ గేట్స్ వంటి ప్ర‌ముఖుల‌తో క‌లిసి ఇండియ‌న్ ఫిలాంథ్ర‌పి ఇనిషియేటివ్ (ఐపీఐ) ద్వారా మ‌రిన్ని అవేర్ నెస్ కార్య‌క్ర‌మాల‌తో ఆక‌ట్టుకుంటున్నారు.
తాజాగా ఉపాస‌న ఓ థ్రోబ్యాక్ ఫోటోని అభిమానుల‌కు సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. “ఈ పోస్ట్ మీలో స్ఫూర్తి నింపుతుంది. గుడ్ టైమ్ కోసం వేచి చూడాలి. ప్ర‌స్తుత స‌న్నివేశంలో ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌శాంత చిత్తాన్ని క‌లిగి ఉండాలి. భవిష్య‌త్ కోసం పాజిటివ్ గా వేచి చూడాలి“ అంటూ చ‌క్క‌ని సందేశాన్ని ఇచ్చారు.
క‌రోనా క‌ల్లోలం నేప‌థ్యంలో ఇలాంటి పాజిటివ్ సూచ‌న‌లు చేయ‌డం సామాన్యుల్లో ధైర్యాన్ని నింప‌డం ఆహ్వానించ‌ద‌గిన‌దే. హ్యాట్సాఫ్ టు మెగా కోడ‌లు ఉపాస‌న‌.

Related Articles

Back to top button
Send this to a friend