ప్రభాస్ వర్సెస్ కెజిఎఫ్-2!

రెబల్ స్టార్ ప్రభాస్ .. ప్రస్తుతం రాధాకృష్ణ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. యూరప్ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ స్టోరీగా వస్తోన్న పీరియాడికల్ సినిమా ఇది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ప్రభాస్ కు ప్యాన్ ఇండియన్ ఇమేజ్ ఉంది. దీంతో ఈ సినిమాను కూడా అదే స్థాయిలో విడుదల చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దసరా బరిలో సినిమాను అక్టోబర్ 16న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితేఆ తర్వాతి వారమే మరో ప్యాన్ ఇండియన్ సినిమా రాబోతోంది. అదే కెజిఎఫ్ చాప్టర్ -2.
కెజిఎఫ్ తో దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ సాధించాడు కన్నడ హీరో యశ్. ఈ మూవీకీ దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే ఆసినిమాకు సీక్వెల్ తో వస్తున్నాడు. ఈ చిత్రంపై కూడా భారీ క్రేజ్ ఉందనే చెప్పాలి. అలాంటి మూవీ ప్రభాస్  సినిమా విడుదలైన వారానికే వస్తుదంటే ఖచ్చితంగా అన్ని అంశాల్లో కంపేరిజన్స్ ఉంటాయి. అంటే ఓ రకంగా ఈ రెండు సినిమాల మధ్యా పోటీ ఉంటుంది. ఇంతకీ కెజిఎఫ్ చాప్టర్ -2 ఎప్పుడు వస్తుందో తెలుసా.. అక్టోబర్ 23న.
మొత్తంగా ఈ సారి దసరా దేశవ్యాప్తంగా ఉన్న కెజిఎఫ్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా ఇవ్వబోతోంది. మరి ఈ పోటీలో మేటి అనిపించుకునేది ఎవరో చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend