ప్రభాస్ మూవీ ప్లానింగ్ భలే భలే..?

డార్లింగ్ స్టార్ ప్రభాస్.. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. అందుకే తన ప్రతి సినిమాతో ఎంటైర్ కంట్రీని మెప్పించాలనుకుంటున్నాడు. ఆ క్రమంలో చేసిన సాహో సౌత్ లో సత్తా చాటలేకపోయింది. అయినా డిజప్పాయింట్ కాకుండా ఇప్పుడు కాస్త రూట్ మార్చి కంప్లీట్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. సాహో తర్వాత మరోసారి ఒకే సినిమా డైరెక్ట్ చేసి ఉన్న రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తన్నాడు. రాధేశ్యాం, ఓ డియర్ అనే టైటిల్స్ వినిపిస్తోన్న ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
సాహో రిజల్ట్ వల్ల మరోసారి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసుకున్న ఈ మూవీ కాస్త ఆలస్యంగా షూటింగ్ ప్రారంభించుకుంది. రీసెంట్ గా కరోనా లాక్ డైన్ ప్రారంభానికి ముందు వరకూ యూరప్ లో షూటింగ్ జరుపుకుని వచ్చింది. ఇక ఇప్పటికే చాలా లేట్ అయిన ఈ మూవీకి ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ మరింత ఇబ్బందిగా మారింది. మామూలుగా దసరా బరిలో నిలవాలనుకున్నాడు ప్రభాస్. బట్ సిట్యుయేషన్ చూస్తే అది సాధ్యమయ్యేలా లేదు. అయినా అలా వదిలేయకుండా తమ ప్రయత్నాలు చేస్తోందిట మూవీ టీమ్.ఇప్పటి వరకూ జరిగిన షూటింగ్ పార్ట్ కు సంబంధించి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేస్తున్నారిప్పుడు. అంటే ఎడిటింగ్ తో పాటు రీ రికార్డింగ్ కూడా పూర్తి చేసి ఉంచుతారు. దీనివల్ల చాలా వరకూ టైమ్ సేవ్ అవుతుంది. ఇక ఈ రెండు పనులకు సంబంధించి ఎక్కువ మనుషులు కూడా అవసరం ఉండదు. అంటే సోషల్ డిస్టెన్సింగ్ ను బాగా ఫాలో కావొచ్చు. పైగా ఎవరి ఆఫీస్ లో వాళ్లే ఉంటారు. అందువల్ల అటు ప్రభుత్వ నిర్ణయాలను పాటించినట్టు ఉంటుంది.. ఇటు తమ సినిమా పూర్తి చేసుకున్నట్టూ ఉంటుందన్నమాట. సో డార్లింగ్ మూవీ టైమ్ కే వచ్చేలా ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button