ప్రభాస్ తో ఆ దర్శకుడి సినిమా కూడా ఉందట


ప్రభాస్ తో సినిమా అంటే ఇప్పుడు జాతీయస్థాయి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకోవాలి. సరికొత్త ప్యాన్ ఇండియన్ స్టార్ గా అవతరించాడు కాబట్టి.. అతని మార్కెట్ రేంజ్ ను బట్టే కథ, కథనాలుండాలి. లేదంటే అతను కూడా ఒప్పుకోవడం లేదు. తనకు వచ్చిన ఈ ప్యాన్ ఇండియన్ మార్కెట్ ను నిలబెట్టుకోవాలనే టార్గెట్ తోనే ప్రభాస్ కూడా ఉన్నాడు. ఆ క్రమంలోనే కొత్తగా ఎంచుకుంటోన్న కథలుంటున్నాయి. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా రాబోతోంది. దీనికి రాధేశ్యాం, ఓ మైడియర్ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ ఉగాది రోజున టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమాకు కమిట్ అయి ఉన్నాడు.
నాగ్ అశ్విన్ తో సినిమా కంటే ముందు ప్రభాస్ .. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ కుమార్ వంగాతో సినిమా చేస్తాడు అనే రూమర్స్ వచ్చాయి. అవి అలా ఉండగానే నాగ్  అశ్విన్ సినిమా అనౌన్స్ చేశాడు. దీంతో సందీప్ తో సినిమా క్యాన్సిల్ అయిందనుకున్నారు. బట్.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కాలేదు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన మూవీ డీటెయిల్స్ కూడా అనౌన్స్ కాబోతున్నాయట.
సందీప్ ఆల్రెడీ స్క్రిప్ట్ ప్రభాస్ కు నెరేట్ చేశాడు. అతను చెప్పిన చిన్నచిన్న మార్పులతో స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నాడట. మొత్తంగా ఈ సినిమాను టి సిరీస్ సంస్థ నిర్మిస్తుందనే ప్రచారం కూడా సాగుతోంది. మరి ఈ కొత్త వార్తపై సందీప్ నుంచి కానీ ప్రభాస్ టీమ్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Related Articles

Back to top button
Close
Send this to a friend