ప్రణీత పెద్ద మనసుకు నెటిజన్లు ఫిదా..

కరోనా తో ఇబ్బంది పడుతున్న పేదలను సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ కి చెందిన పలువురు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే హీరో లతో పోటీ పడుతూ రెమ్యునరేషన్ లు,యాడ్ షూట్ లు చేసే ఒకరిద్దరు మినహా హీరోయిన్లు ఎవరూ ముందుకు వచ్చిన దాఖలాలు లేవు.కానీ ఎటువంటి పబ్లిసిటీ కోరుకోకుండా తానే స్వయంగా వంట చేసి పేదల ఆకలి తీరుస్తోంది నటి ప్రణీత.ఆమె చేస్తున్న పనిని అందరూ అభినందిస్తున్నారు. పిల్లో ఛాలెంజ్ ,రియల్ మాన్ ఛాలెంజ్ పబ్లిసిటీ తప్ప సోషల్ రెస్పాంసిబిలిటీ కనిపించడంలేదని,ప్రణీతని చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

Related Articles

Back to top button
Send this to a friend