పూజ హెగ్డే కు మరో బంపర్ ఆఫర్


పూజా హెగ్డే… వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్యూటీ. కొన్ని రోజుల క్రితం తనకు వర్క్ ఉంది కానీ హిట్లు లేవు. దీంతో అమ్మడు నీ అంత ఆడిపోసుకున్నారు కూడా. త్రివిక్రమ్ చేతుల్లో పడ్డ తర్వాత ఈ భామ ఫేట్ మారిపోయింది. అరవింద సమేత వీర రాఘవ తో మంచి మార్కులు కొట్టేసింది పూజ.అటుపై చిన్న పాత్రే అయినా గద్దలకొండ గణేష్ లో చేసిన తన క్యారెక్టర్ కు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో పాటు తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టిన తర్వాత పూజ ఎందుకో మన వాళ్లకు ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయింది. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన అల వైకుంఠ పురములో మూవీ సృష్టించిన రికార్డులు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తన కెరీర్లో ఇది బిగ్గెస్ట్ హిట్.
ప్రస్తుతం ప్రభాస్ సరసన రాజ్యం అనే సినిమాలో నటిస్తోంది పూజాహెగ్డే. దీంతో పాటు అక్కినేని అఖిల్ హీరోగా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోనూ తనే హీరోయిన్. ఈ సినిమా కోసం తను రెగ్యులర్ గా తీసుకుంటున్న రెమ్యునరషన్ కంటే కూడా చాలా ఎక్కువ డిమాండ్ చేసిందట. మరోవైపు బాలీవుడ్ లోను క్రేజీ ఆఫర్స్ కొట్టేస్తోంది ఈ భామకు లేటెస్ట్ గా మరో బంపర్ ఆఫర్ తగిలింది.. అది కూడా ఓ సూపర్స్టార్ సరసన.
ప్రస్తుతం సౌత్ మొత్తం హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరైనా ఉంటే అది తమిళ్ సూపర్ స్టార్ విజయ్ మాత్రమే. ఎస్ మనోడు ఒక్కో సినిమాకు దాదాపు 80 నుంచి 100 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. పొన్నాల అతను చేసిన ప్రతి సినిమా 150 కోట్ల వరకు కలెక్షన్స్ చేస్తోంది. రీసెంట్గా వచ్చిన మెర్సల్ రెండు వందల యాభై కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. సో విజయ్ నెక్స్ట్ సినిమాలో ఇప్పుడు పూజా హెగ్డే హీరోయిన్ గా తీసుకోబోతున్నారు.
నిజానికి పూజ హెగ్డే 2012లోనే తమిళ సినిమాలలో అరంగేట్రం చేసింది. కానీ అక్కడ చేసిన తొలి సినిమా ఫ్లాప్ కావడంతో ఆ తర్వాత వాటిని ఎవరూ పట్టించుకోలేదు. ఈ గ్యాప్లో తెలుగులో సూపర్ స్టార్ అయింది కాబట్టి ఆ స్టార్ డమ్ ని అడ్డంపెట్టుకుని ఏకంగా సూపర్స్టార్ సరసన సెకండ్ ఛాన్స్ కొట్టేసింది పూజ. సుధాకర్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా ఈ వేసవిలో ప్రారంభం అవుతుందని సమాచారం. మొత్తంగా పూజ దూకుడుకి అదే లేదన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend