పూజాహెగ్డేను అలాంటి పాత్రలో చూస్తారా..?


తెలుగులో వరుస విజయాలతో టాప్ రేస్ లో ఉన్న బ్యూటీ పూజాహెగ్డే. తనకు రష్మిక మందన్నా తప్ప పెద్దగా పోటీ కూడా లేకపోవడంతో ఇంకా కలిసొచ్చింది. యాక్టింగ్ స్కిల్స్ గురించి పక్కనబెడితే.. స్కిన్ షోలో ఎక్స్ పర్ట్ అనిపించుకున్న ఈ డస్కీ బ్యూటీ రీసెంట్ గా అల వైకుంఠపురములో చేసిన థై షోకు అంతా ఫిదా అయిపోయారు. మరోవైపు తనే డబ్బింగ్ లు కూడా చెప్పుకుంటూ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన నటిస్తోంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీకి రాధేశ్యామ్ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. మరోవైపు అక్కినేని అఖిల్ సరసన నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమా ఈ సమ్మర్ లో విడుదల కాబోతోంది. మరోవైపు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన ఓ సూపర్ ఆఫర్ కొట్టేసింది. ఈ టైమ్ లో తను ఓ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయబోతోందనే వార్తలు ఆశ్చర్యపరుస్తున్నాయి.
తెలుగులో దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందనే వార్త మరింత ఆశ్చర్యంతో పాటు అనుమానాలూ కలిగిస్తోంది. కారణం.. హను రీసెంట్ గా బాలీవుడ్ కు వెళుతున్నట్టుగా, అక్కడ సన్నిడియోల్ హీరోగా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ టైమ్ లో మళ్లీ పూజాహెగ్డేతో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అంటే ఆశ్చర్యమే కదా.
ఏదేమైనా పూజాకు ప్రస్తుతం ఉన్న ఇమేజ్ తో పోల్చి చూస్తే ఇలా తనకు ఓ సినిమాను లీడ్ చేసేంత కెపాసిటీ ఉందా అనిపించక మానదు. పైగా హను డిజైన్ చేసే హీరోయిన్ పాత్రలే బలంగా ఉంటాయి. మరి హీరోయిన్ సెంట్రిక్ అంటే తనవల్ల అవుతుందా అని డౌట్.

Related Articles

Back to top button
Send this to a friend