పిట్టకథను సపోర్ట్ చేస్తోన్న మెగాస్టార్

మెగాస్టార్.. టాలీవుడ్ కు పెద్దన్నగా మారాడు. చిన్నా పెద్దా అని చూడకుండా ఎవరైనా సినిమాకు సంబంధించిన ఫంక్షన్ కు పిలిస్తే వెంటనే వెళ్లిపోయి వారిని ఆశిస్సులు అందిస్తున్నాడు. ఇంక మంచి సినిమాలు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఇంటికి పిలిచి మరీ అభినందిస్తున్నాడు.
ఈ క్రమంలోనే సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు హీరోగా పరిచయం అవుతోన్న ‘ఓ పిట్టకథ’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అటెండ్ కాబోతున్నాడు. ఓ పిట్టకథ టీజర్, సాంగ్ ఇప్పటికే ఆకట్టుకున్నాయి. మార్చి 6న ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతోంది.
ఇక మార్చి 1న హైదరాబాద్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ వస్తుండటం మా అదృష్టం అంటూ పోస్టర్స్ కొట్టించి మరీ అనౌన్స్ చేసింది టీమ్. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు, విశ్వాంత్, నిత్యశెట్టి లీడ్ రోల్స్ చేస్తోన్న ఈ మూవీపై మంచి ఇంప్రెషన్ వేయడంలో టీమ్ సక్సెస్ అయింది. చెందు ముద్దు దర్శకుడుగా పరిచయం కాబోతోన్న ఈ పిట్టకథకు మెగాస్టార్ ప్రెజెన్స్ ఖచ్చితంగా ప్లస్ అవుతుందనే చెప్పాలి.

Related Articles

Back to top button
Send this to a friend