పవర్ ఫుల్ పొలిటీషియన్ గా రమ్యకృష్ణ..?

రమ్యకృష్ణ .. తనకు బాహుబలికి ముందున్న ఇమేజ్ పూర్తిగా వేరు. ఇక నైన్టీస్ లో తన గ్లామర్ కు డంగైపోని కుర్రాళ్లే లేరు. అన్ని వయసుల వారిని ఉర్రూతలూపిన సోయగం తను. అదే ఇమేజ్ హీరోయిన్ గా ఫేడవుట్ అయిన తర్వాత కూడా కొన్నాల్లు కంటిన్యూ చేసింది. కుర్ర హీరోల సరసన హాట్ హాట్ ఐటమ్ సాంగులూ చేసింది. కానీ బాహుబలి తర్వాత తన పాత ఇమేజ్ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో తను కూడా ఇక సెలెక్టివ్ సినిమాలే చేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యం ఉండాలి.. హుందాగానూ కనిపించాలి అనే ఫార్ములా ఫాలో అవుతోంది. మొత్తంగా ఇప్పుడు తను కొన్ని సినిమాలకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావడానికి కారణం శివగామి పాత్రే అంటే కాదనలేం.
ఆ ఎట్రాక్షన్ కోసమే రమ్యకృష్ణను ఓ పవర్ ఫుల్ రోల్ కు సెలెక్ట్ చేసుకున్నాడు దర్శకుడు దేవా కట్టా. సాయితేజ్ తో తను తీయబోతోన్న పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో రమ్య కోసం ఓ అద్బుతమైన పాత్ర డిజైన్ చేశాడట. ఈ పాత్ర సినిమా హైలెట్స్ లో ఒకటిగా ఉంటుందని టాక్. మరోవైపు రావు రమేష్ ను సైతం ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నాడు. ఈ రెండు పాత్రల నడుమ సాయితేజ్ క్యారెక్టర్ ను కూడా హైలెట్ చేయడం అంటే దేవా కట్టాకు కత్తిమీద సాములాంటిదే.
రీసెంట్ గా రమ్యకృష్ణ ఓ వెబ్ సిరీస్ కోసం దివంగత నటి, ముఖ్యమంత్రి  జయలలిత బయోపిక్ లో నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. మరి ఈ సారి సిల్వర్ స్క్రీన్ పై ఈ పొలిటీషియన్ ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

Back to top button
Send this to a friend