పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రోల్స్ మొదలయ్యాయి

పొలిటికల్ పిక్చర్ లో సక్సెస్ కాలేకపోయినా పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందుకోసం బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన పింక్ సినిమా రావాలి అనుకున్నాడు పవన్ కళ్యాణ్. నిజానికి ఇది రైట్ ఛాయిస్ కాదని చాలామంది భావించారు కూడా. కానీ దిల్ రాజు మాత్రం ఈ సినిమాని రీమేక్ చేయాలని పట్టుబట్టాడు. అయితే తన పొలిటికల్ పిక్చర్ కు కూడా ఈ రీమేక్ ఉపయోగపడుతుంది భావించాడు ఏమో కానీ, పవన్ కూడా దిల్ రాజు ఓటేశాడు.
మొత్తంగా నిన్న విడుదలైన పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పై విపరీతమైన ట్రాల్స్ పడుతున్నాయి.  ‘వకీల్ సాబ్ లుక్ కోసం చూస్తే ఫకీర్ సాబ్’ వచ్చాడు ఏంటి అంటున్నారు కొందరు.
ఇక మరికొందరేమో ఇది పవన్ కళ్యాణ్ చదువుతున్న ఎన్నో పుస్తకమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు పింకు కానీ ఆ సినిమా తమిళ్ రీమేక్ నీర్కొండ పార్వై  కానీ ఫస్ట్ లుక్ పోస్టర్లు వచ్చినప్పుడు.. ఆయా పోస్టర్స్ లో కచ్చితంగా సినిమాలోని ఫీమేల్ లీడ్ కూడా ఉన్నారు. అంటే సినిమా లో ప్రధానంగా కనిపించే ఆ ముగ్గురు అమ్మాయిల తో పాటు హీరో బొమ్మ కూడా పోస్టులు ఉంటుందన్నమాట. కానీ ఆ రెండు సినిమాలకు భిన్నంగా కేవలం హీరోయిన్ గా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది. ఒక పొలిటికల్ పార్టీ అధినేత కూడా అయిన పవన్ కళ్యాణ్ ఇలా మహిళల గురించి పోస్టర్ లో కనీసంగా చెప్పకపోవడం పై కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా ఈ పోస్టులు చూసిన తర్వాత ఇది పింక్ సినిమాలోని ఆత్మను కాక.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను ఆధారంగా చేసుకుని వస్తున్న సినిమా అనేది సులువుగానే అర్థమైపోతుంది. మరి ఈ నెల 8 వ తారీఖున మహిళా దినోత్సవం సందర్భంగా ఆ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ని విడుదల చేస్తామన్నారు. అది నా ఆడవాళ్ళ మీద ఉంటుందా లేక పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సాంగ్ అవుతుందా అనేది చూద్దాం.

Related Articles

Back to top button
Send this to a friend