పవన్ కళ్యాణ్ నుంచి శిరీష్ వరకు పడిపోయిన అమ్మడు

లక్ ఉంటేనే పట్టించుకునే పరిశ్రమ ఇది. అంటే లక్ ఉంటేనే విజయాలు వస్తాయి. దానికి టాలెంట్ తో పెద్దగా పని లేదు. ఇక హీరోయిన్లకు ఐతే ఇది ఎక్కువగా వర్తిస్తుంది. అందుకే యెంత అందం ఉన్న లక్ లేక కొందరు భామలు చాల తొందరగా కనుమరుగు అవుతారు. అందుకు ఎందరో భామలు ఉదాహరణలుగా మిగిలారు. అలాంటి ఆరిలో యు ఎస్ బ్యూటీ అను ఇమ్మానుయేల్ ముందు వరుసలో ఉంటుంది. ఈ మలయాళీ మూలాలు ఉన్న భామకు తెలుగు లో మన స్టార్ హీరోలు దర్శకులు మొదట్లో పట్టం కట్టారు. కానీ అదేంటో అమ్మడు చేసిన అన్ని సినిమాలూ పోయాయి. అను ఉంటె ప్లాప్ అనే ముద్ర పడిపోయింది. పాపం ఆయా సినిమాల ఫ్లోప్స్ కు తాను పెద్ద రీజన్ కాకపోయినా ఐరన్ లెగ్ అనేసారు. దీంతో కోలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ సేమ్ సీన్. ఇక మల్లి ఓవర్సీస్ కు దుకాణం సర్దేయాలనుకుంటోన్న టైం లో మల్లి తెలుగు లో ఒక ఆఫర్ వచ్చింది. అది సెట్స్ లో ఉండగానే ఇప్పుడు మరోటి పట్టింది.
ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ గట్టిగ ఉన్న టాలెంట్ అనే పదం లేక.. దానికి తోడు లక్కూ కలిసి రాక హిట్ కోసం చకోర పక్షిలా చూస్తోన్న అల్లు శిరీష్ సరసన అను కు ఛాన్స్ వచ్చింది. అసలే ఆఫర్స్ లేవు కదా. అందుకే ఈ కుర్రాడికి కూడా ఓకే చెప్పింది. దీంతో మెగాస్టార్ తో చేసిన చోటే మినీ స్టార్ తో చేయడం అంటే ఇదే అంటూ సెటైర్స్ వేస్తున్నారు. పోంలెండి.. ఇలాగైనా కనీసం లైం లైట్ లో ఉంటుంది కదా.. మళ్ళి ఏదో రోజు చిన్న హీరో తో ఐన పెద్ద హిట్ పడకపోద్దా అప్పుడు మల్లి పెద్ద హీరోల కళ్ళు అమ్మడి మీద పడక పోతాయా. అసలే ఆశల ప్రపంచం కదా ఇది.

Related Articles

Back to top button
Send this to a friend