పవన్ కళ్యాణ్ తో పూరీ జగన్నాథ్

ఈ కాంబినేషన్ ఎప్పుడు విన్నా ఎగ్జైటింగ్ గానే ఉంటుంది. నిజమే.. పవన్ కళ్యాణ్ కు ఇప్పుడున్న పరిస్థితిలో పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులే కరెక్ట్. ఇంతకు ముందు పూరీ కూడా మహేష్ కోసం జనగణమన అనే కథ సిద్ధం చేసుకున్నాడు. కానీ ఆ కథ కాస్త మార్పులు చేస్తే పవన్ కు ఇప్పుడు బాగా సరిపోతుంది. ఈ పొలిటికల్ హీరోకు ఇలాంటి కథలే కరెక్ట్ కూడా. ఇంతకీ విషయం ఏంటంటే.. మళ్లీ సినిమాలు చేస్తూ మొహానికి రంగేసుకున్న పవన్ కళ్యాణ్ ఓ రేంజ్ లో దూకుడు చూపుతున్నాడు. ఇన్నేళ్లలో చేసిన సినిమాల్లో సగం ఈ రెండేళ్లలోనే చేయబోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. మరో రెండు సినిమాలు సిద్ధం కాబోతున్నాయి. ఒకటి హరీష్ శంకర్ తో మరోటి గోపాలా గోపాలా ఫేమ్ డాలీ(కిశోర్ పార్థసాని)ని కథ రెడీ చేసుకోమని చెప్పాడు. మరోవైపు తనతో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేసిన బాబీకి ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడీ వరసలో పూరీ జగన్నాథ్ పేరు కూడా చేరింది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్న బిజీకి చేస్తోన్న సినిమాల్లో రెండు ఈ యేడాదే వస్తాయి. మరో రెండు వచ్చే యేడాది. అయితే పూరీ విజయ్ దేవరకొండతో చేస్తోన్న మూవీ ఈ యేడాదికి వస్తుంది. ఆ తర్వాత నిజంగాన ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయితే ఖచ్చితంగా నెక్ట్స్ ఇయర్ పూరీ జగన్నాథ్ సినిమా విడుదలవుతుంది. అంటే రెండేళ్లలో కనీసం అరడజను సినిమాలు వస్తాయన్నమాట. మొత్తంగా ఈ కాంబినేషన్ నిజం అవుతుందా లేదా అనేది చూడాలి.

Related Articles

Back to top button
Close
Send this to a friend