పలాస దర్శకుడితో ‘ఆహా’ అనిపించేందుకేనా..?

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ మోస్ట్ నిర్మాతగా తిరుగులేని ఆధిపత్యం చూపించే నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ అధినేతగా, డిస్ట్రిబ్యూటర్ గా అనుభవజ్ఞుడైన అరవింద్ కొన్నాళ్ల క్రితమే ట్రెండ్ ను పసిగట్టాడు. రాబోయే రోజుల్లో థియేటర్స్ పై ఆధిపత్యం పెద్దగా నడవదని తెలుసుకున్నాడు. అలాగే సినిమా లైఫ్ కూడా రోజురోజుకూ తగ్గుతోందనే విషయం కూడా తెలుసుకున్నాడు. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ పై కన్నేశాడు. ఓటిటి ప్లాట్ ఫామ్ అంటూ ఆహా అనే స్ట్రీమింగ్ తో తెలుగు వెబ్ సిరీస్ లు చేస్తానంటూ సరికొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించి ఏడాది క్రితం నుంచే పనులు మొదలయ్యాయి. రీసెంట్ గా అఫీషియల్ గానే ప్రారంభించాడు.కాకపోతే ఈ ఫార్మాట్ లో అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు. దీంతో సరికొత్తగా వస్తోన్న యువతరం దర్శకులపై కన్నేశాడు. ఈ మధ్య కాలంలో ఏదైనా సినిమా బావుందన్న టాక్ వచ్చినా.. లేదంటే దర్శకుడు బాగా చేశాడన్న పేరు వచ్చినా వెంటనే వారిపై కర్చీఫ్ లు వేస్తున్నాడు.
లేటెస్ట్ గా  పలాస చిత్ర దర్శకుడు కరుణ కుమార్ కు కూడా చెక్ ఇచ్చాడు. అయితే ఇది సినిమా కోసం కాదని టాక్. ఆహాలో కొన్ని వెబ్ సిరీస్ లు అతనితో చేయించేందుకే ఈ చెక్ ఇచ్చాడని తాజా సమాచారం. నిజానికి కరుణ కుమార్ పలాస చూసిన ఎవరికైనా అదో వెబ్ సిరీస్ గా వచ్చి ఉంటే ఇంకా రస్టిక్ గా ఉండేది అనిపిస్తుంది. అందుకే అతన్ని అల్లు అరవింద్ సెలెక్ట్ చేసుకున్నాడనుకోవచ్చు. అయితే ప్రస్తుతం పలాస దర్శకుడు మాత్రమే ఎలివేట్ అవుతున్నాడు.కానీ ఇంకా చాలామంది ఈ మధ్య కాలంలో వచ్చిన దర్శకులకు తన ఆహాలో వెబ్ సిరీస్ ల కోసం అడ్వాన్స్ లు ఇచ్చాడట అరవింద్. ఎంతైనా అరవింద్ మామూలోడు కాదు.

Related Articles

Back to top button
Send this to a friend