పలాస ట్రైలర్ టాక్ – మైండ్ బ్లోయింగ్

పలాస 1978 .. గత కొన్ని రోజులుగా ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా వినిపిస్తోన్న పేరు. ఇప్పటికే సినిమా చూసిన చాలామంది సినిమా గురించి ఓ రేంజ్ లో పొగుడుతున్నారు. తెలుగు సినిమాకు మంచి రోజులు వచ్చాయి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మన దగ్గర ‘నేటివిటీ’దాదాపు లేవు. ఎప్పుడో ఒకటీ అరా వచ్చినా అందులో రియాలిటీ కంటే హీరోయిజం ఎక్కువ. కానీ పలాసలో రియాలిటీతో పాటు హీరోయిజం కూడా ఉన్నట్టే కనిపిస్తోంది. కరుణ కుమార్ దర్శకుడుగా అరంగేట్రం చేస్తోన్న ఈ చిత్రంలో రక్షిత్, నక్షత్ర, రఘు కుంచె, తిరువీర్ కీలక పాత్రల్లో నటించారు..
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ట్రైలర్ ను రానా చేతుల మీదుగా విడుదల  చేశారు. ఊహించిన దానికన్నా ఎక్కువ ఇంటెన్సిటీ కనిపిస్తోందీ చిత్రంలో. ముఖ్యంగా ఆర్ఆర్ నెక్ట్స్ లెవెల్ అన్నట్టుగా ఉంది. గ్రామీణ రాజకీయాల్లో ఉండే వాస్తవ కోణాలను అత్యంత వాస్తవికతతో చిత్రీకరించినట్టుగా కనిపిస్తోంది. ప్రతి నటుడూ సహజంగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా లండన్ బాబులో నటించిన హీరో రక్షిత్ ఈ సారి పూర్తి భిన్నమైన క్యారెక్టర్ తో వస్తున్నట్టున్నాడు. అతని నటనా బావుందంటున్నారు. మొత్తంగా ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నెల 6న పలాస విడుదల కాబోతోంది.
ఇక ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే తెలుగు సినిమాకూ మంచి రోజులు వస్తాయి అనుకోవచ్చు. అలాగని బాలేకపోయినా ఆదరించమని కాదు.. బట్ బావుంటే ఖచ్చితంగా పదిమందికి చెబితే సినిమా రేంజ్ కూడా మారుతుంది. ఇలాంటి కథలు రాసుకునే దర్శకులకు మంచి ప్రోత్సాహంగా ఉంటుంది

Related Articles

Back to top button
Send this to a friend