పర్ఫెక్ట్ హజ్బెండ్ గా కట్టప్ప…!

ఒకప్పుడు తమిళనాడులో స్టార్ విలన్ గా తర్వాత స్టార్ హీరోగా మారి తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు సత్యరాజ్. మహానటుడు కాదు కానీ.. ఏ పాత్ర చేసినా మెప్పించగలడు. ముఖ్యంగా తెలుగులో వచ్చిన ఎమ్ ధర్మరాజు ఎమ్ఏ, ఆరాధన వంటి సినిమాల ఒరిజినల్స్ లో అతను పోషించిన పాత్రలతో అక్కడ క్రేజ్ తెచ్చుకున్న సత్యరాజ్ ఆ పేరుతో కొన్ని డబ్బింగ్ సినిమాలతో మనవారీకీ పరిచయమే. అయితే కొన్నాళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ ఆఫర్స్ కొట్టేస్తోన్న సత్యరాజ్ కు బాహుబలితో వచ్చిన రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. అప్పటి నుంచీ సత్యరాజ్ గా కంటే కట్టప్పగానే ఫేమ్ అయిన ఈ తమిళ్ నటుడు త్వరలోనే ఓ వెబ్ సిరీస్ లోనూ కనిపించబోతున్నాడు.
ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న సత్యరాజ్ లేటెస్ట్ గా ఓ వెబ్ సిరీస్ కు సైన్ చేశాడు. ఇది అతని తొలి వెబ్ సిరీస్. అయితే తెలుగుతో పాటు, తమిళ్ లోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చేస్తోన్న సత్యరాజ్ ఇలా సడెన్ గా డిజిటల్ మీడియాలోకీ ఎంటర్ కావడం చాలామందిని ఆశ్యర్యపరుస్తోంది. అయితే ఇందులో తనే ప్రధాన పాత్ర చేస్తున్నాడట. ఈ వెబ్ సిరీస్ టైటిల్ పేరు ‘ద పర్ఫెక్ట్ హజ్బెండ్’. తమిర అనే తమిళ్ కుర్రాడు డైరక్ట్ చేస్తోన్న ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే తెలియజేస్తారట.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button