పరశురామ్ కాదా.. ప్రవీణ్ సత్తారా..?

మహేష్ బాబు నెక్ట్ సినిమా డైరక్టర్ ఎవరు..? టాలీవుడ్ లో ఇప్పుడిదో హాట్ టాపిక్ గా మారింది. నిన్నటి వరకూ పరశురామ్ అని వినిపించినా.. ఇప్పుడు ప్రవీణ్ సత్తారు పేరూ ప్రముఖమైపోయింది. ఎందుకంటే కొన్నాళ్ల క్రితమే ప్రవీణ్ సత్తారు మహేష్ కు కథ వినిపించాడు. అది నచ్చింది కూడా. కొన్ని మార్పులు చేర్పులూ ఉన్నాయట అంతే. అయితే తనను ప్రవీణ్ డీల్ చేయగలడా అనే డౌట్ తోనే ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉంచారు. ఇప్పుడు పరశురామ్ కూడా అంతే. అయితే ప్రరశురామ్ ఆల్రెడీ లాక్ అయి ఉన్నాడు. పైగా అతను మైత్రీ మూవీస్ తో సినిమా అంటే చేయను అని ఖరాఖండీగా చెబుతున్నాడట. మహేష్ మాత్రం మైత్రీకే సినిమా చేయాలిప్పుడు. కాకపోతే గతంలో మైత్రీ బ్యానర్ పరశురామ్ ను అవమానించిందట. ఆ కారణంగా అతను ఆ బ్యానర్ లో సినిమాకు ససేమిరా అంటున్నాడు. మహేష్ ను వదులుకోవడానికైనా రెడీ. కానీ మైత్రీ వాళ్లతో కలిసి పనిచేయను అని భీష్మించుకున్నాడంటున్నారు.
దీంతో  చేసేదేం లేక.. ప్రవీణ్ సత్తారుతో కూడా చర్చలు మొదలయ్యాయట. ప్రస్తుతం ప్రవీణ్ ఖాళీగానే ఉంటున్నాడు. కొంచెం టైమ్ ఇచ్చినా లేదంటే ప్రొడక్షన్ లో ఉండగానే మహేష్ చెప్పిన మార్పులు కథలో సులువుగా చేయగల ప్రతిభావంతుడు అతను. అందువల్ల ప్రవీణ్ వైపూ చూస్తున్నారట. ఏదేమైనా ఈ విషయం ప్రవీణ్ సత్తారే కొందరితో చెబుతున్నాడు. అంటే బాల్ ప్రస్తుతం సెంటర్లో ఉందన్నమాట. అది పరశురామ్ కోర్ట్ లో పడుతుందా ప్రవీణ్ కోర్ట్ లోకి వెళుతుందా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.

Related Articles

Back to top button
Send this to a friend