పద్ధతి మారకుంటే కష్టం అంటున్న అమెరికన్లు

ట్రంప్ పేరుకి అమెరికా అధ్యక్షుడే కానీ ఎప్పుడూ ఆ స్థాయి లో హుందాగా ప్రవర్తంచలేదు.వివాదాలు ,విమర్శలు లు ట్రంప్ కి వెన్న తో పెట్టిన విద్య.అర్థం పర్థం లేని మాటలు,తలతిక్క నిర్ణయాలతో ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోవడం కొత్తేం కాదు.కరోనా ని కూడా ట్రంప్ తేలికగా తీసుకున్నారని అందుకే అమెరికా లో పరిస్థితులు అదుపుతప్పాయని అమెరికన్లే మండిపడుతున్నారు. తాజాగా ఓ ప్రెస్ మీట్ లో కరోనా వైరస్ నాశనం అవ్వాలంటే క్రిమిసంహారక మందులతో చికిత్స అందించండి,యు.వి కిరణాలు శరీరం లోకి పంపిస్తే వైరస్ చచ్చి పోతుంది అని వెటకారం చేశాడని అక్కడి మీడియా లో వార్తలు వచ్చాయి.దీనికి అమెరికన్ ల నుండే కాక సొంత పార్టీ నేతల నుండి కూడా తీవ్ర విమర్శలు రావడంతో వివరణ ఇచ్చారు ట్రంప్.”అవి కరోనా గురించి అన్న మాటలు కాదు,వాటిని సీరియస్ గా తీసుకోకండి,కావాలనే ఓ వర్గం మీడియా నా మీద తప్పుడు ప్రచారం చేసి నా మాటలు వక్రీకరిస్తుంది”అంటూ ట్వీట్ చేశారు.”కామన్ సెన్స్ తో ఆలోచించి జాగ్రత్త గా ఉండండి అని సలహా ఇచ్చారు.ఏది ఏమైనా ప్రస్తుతం ట్రంప్ కి వస్తున్న వ్యతిరేకత చేస్తుంటే ట్రంప్ రాజకీయ భవిష్యత్తు కష్టం గా నే కనిపిస్తోంది..

Related Articles

Back to top button
Send this to a friend