నేను ఎప్పుడూ అండగా ఉంటా:రాశీ ఖన్నా

 

ఇటీవల తన మీద వచ్చిన ట్రోల్స్ మీద స్పందించింది రాశీ ఖన్నా.గతంలో విజయదేవర కొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా లో తన పాత్ర గురించి కొంత అసంతృప్తి తో ఉన్నట్లు,ఇక పై అలాంటి పాత్ర లు చేయకూడదు అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిని తీవ్రంగా ఖండించింది రాశి ఖన్నా.”నటించే ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని లేదు,కానీ నా వరకు నేను ప్రతి మూవీ నుండి ఏదో ఒకటి నేర్చుకుంటాను,ప్రతి మూవీ ఒక అందమైన జర్నీ.అన్నిటికంటే ముఖ్యంగా నేను నటించే ప్రతి సినిమాకు నేను అండగా ఉంటాను అని రాశీ వివరణ ఇచ్చింది.సినిమాల నుంచే కాదు లాక్ డౌన్ లో కూడా చాలా నేర్చుకుందట.ఇప్పటి వరకు అసలు అలవాటు లేని వంట కూడా నేర్చుకుందట.ఈ విషయం లో మా అమ్మ చాలా హ్యాపీ గా ఉన్నారు అంటోంది రాశీ ఖన్నా.

Related Articles

Back to top button
Send this to a friend