నా 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నా: వెంకయ్య

ఎపిలో మూడు రాజదానుల అంశంపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పాలన ఒకే చోటు నుంచి ఉండాలన్నది తన నిశ్చితాభిప్రాయమని ఆయన అన్నారని వార్తలు వచ్చాయి.;సీఎం, పాలనా యంత్రాంగం, హైకోర్టు, అసెంబ్లీ ఒక్క చోటే ఉండాలి. అన్ని ఒక్కచోట ఉంటేనే పాలనలో సౌలభ్యం ఉంటుందని ఆయన అన్నారు.అయితే అది ఎక్కడ అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం. నా 42 ఏళ్ల అనుభవంతో ఈ మాట చెబుతున్నా. వివాదం కోసమో, రాజకీయం కోణంలోనో నా అభిప్రాయం చూడవద్దు. కేంద్రం నన్ను అడిగితే నేను ఇదే అభిప్రాయం చెబుతానని ఆయన అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend