నా పెళ్లి నా ఇష్టం – త్రిష

త్రిష.. రెండు దశాబ్ధాలుగా సౌత్ ఆడియన్స్ ను అలరిస్తోన్న బ్యూటీ. ఇన్నేళ్లైనా ఏ మాత్రం వన్నె తరగని సోయగాలతో నేటికీ ఆకట్టుకుంటోంది. మధ్యలో బాలీవుడ్ లోనూ సందడి చేసిన ఈ డస్కీ బ్యూటీ ఓ దశలో తెలుగుతో పాటు తమిళ్ లోనూ నెంబర్ వన్ గా ఓ వెలుగు వెలిగింది. కొత్త అందాల పోటీలో తట్టుకోలేక కాస్త వెనకబడింది. అయినా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. తెలుగులో ఇప్పుడు చిరంజీవి, కొరటాల సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అంటున్నారు. కానీ ఇంకా కన్ఫార్మ్ కాలేదు.
ఇక కొన్నాల్ల క్రితం వరుణ్ అనే ప్రొడ్యూసర్ తో ఎంగేజ్మెంట్ చేసుకుంది త్రిష. కానీ సడెన్ గా ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. అంతకు ముందు రానాతో ప్రేమ అంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. అన్నీ అయిపోయాయి.. ఇక ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో కెరీర్ పైనే ఫోకస్ చేసింది. ప్రస్తుతం తను నటించిన ‘పరమ పదం వెళయాట్టు’సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన పెళ్లి గురించి అడిగితే ఓ రేంజ్ లో ఆన్సర్ చెప్పింది.
తనకు పెళ్లి చేసుకోవలనిపించినప్పుడే చేసుకుంటుందట. అందుకు తగ్గ వరుడు దొరికితే అప్పుడు ఆలోచిస్తుందట. అంతే కాదు.. తన పెళ్లి మేటర్ ఎవరిని ఇన్వాల్వ్ మెంట్ నూ సహించదట. అంటే తల్లిదండ్రులను కూడా పక్కన బెట్టేసి పూర్తిగా తనకు నచ్చినవాడితో.. తనకు నచ్చినట్టుగానే పెళ్లాడుతుందట ఈ బ్యూటీ. అంతేలే.. ఆమె పెళ్లి ఆమె ఇష్టం.. మధ్యలో మనకెందుకూ..?

Related Articles

Back to top button
Send this to a friend