నారా లోకేష్ కు పరిటాల ఛాలెంజ్..

పరిటాల శ్రీ రామ్, పరిటాలరవి కొడుకు గానే కాదు తెలుగుదేశం యువ నేత గా అందరకి సుపరిచితం. పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ద్వారా అనంతపురం జిల్లా లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు.తాజాగా ట్విట్టర్ లో శ్రీ రామ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. స్వతహాగా రైతు బిడ్డ కాబట్టి అదే తరహా లో కొన్ని పనులు చేసి రియల్ మాన్ ఛాలెంజ్ ను పూర్తి చేసారు. పశువుల కు దాణా వేస్తూ,పొలానికి నీరు పెడుతూ,ట్రాక్టర్ నడుపుతూ రైతు శ్రమ ని మనకి చూపించారు.నాన్న కి ఇష్టమైన వ్యవసాయ పనులు చేశాను,మీరు కూడా మీకు అందుబాటులో ఉన్న పనులు చేయండి అని నారా లోకేష్ ను,ఎం.పి.గల్లా జయదేవ్ ను ,నటుడు మోహన్ బాబు ను నామినేట్ చేశారు.

Related Articles

Back to top button