నాని సినిమాకు పెరుగుతోన్న పోటీ

నాని మొదటిసారిగా నెగెటివ్ రోల్ ప్లే చేసిన సినిమా ‘వి’. ఇది అతనికి 25వ సినిమా కావడం విశేషం. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కాబోతోంది. ప్రధాన పాత్రలో సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో నివేదా థామస్, అదితిరావు హైదరి ఫిమేల్ లీడ్ లో నటిస్తున్నారు. తమన్ నేపథ్య సంగీతం అందించిన ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు పెద్దగా పోటీ లేదు.కానీ ఇప్పుడు నానికి పోటీగా మరో ఇద్దరు కుర్రాళ్లు వస్తున్నారు. ఇంతకు ముందే రాజ్ తరుణ్ తన ‘ఒరేయ్ బుజ్జిగా’చిత్రంతో వస్తున్నాడు. అయితే ప్రస్తుతం తరుణ్ పరిస్థితి తెలిసిన ఎవరైనా నానికి పోటీ ఇస్తాడనుకోలేం. దీంతో లైట్ తీసుకున్నారు.కానీ మెల్లగా ఈ నెల 25కు ముందూ లేదా వెనకగా పోటీ పెరుగుతోంది.
ఇప్పటికే అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ సినిమా ఈ నెల 24న డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇక లేటెస్ట్ గా యాంకర్ ప్రదీప్ నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రం కూడా 25కు ఫిక్స్ అయింది. అయితే ప్రదీప్ కదా అని లైట్ తీసుకోవచ్చు.కానీ ఆ సినిమాను గీతా ఆర్ట్స్ తో పాటు యూవీ క్రియేషన్స్ బ్యానర్ వాళ్లు సంయుక్తంగా విడుదల చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా థియేటర్స్ పరంగా నానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. ఇక ఒరేయ్ బుజ్జిగా చిత్రానికి గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్ విజయ్ కుమార్ దర్శకుడు. ఏదైనా మ్యాజిక్ జరిగితే ఖచ్చితంగా పోటీ పెరుగుతుంది. ఏదేమైనా ఇప్పటి వరకూ సోలో రిలీజ్ అనుకున్న నానికి మెల్లగా పోటీ పెరుగుతోం

Related Articles

Back to top button
Send this to a friend