నాని వెనక్కి వెళ్లిపోయాడు

నేచులర్ స్టార్ నాని.. కెరీర్ లో తొలి మైలు రాయిని చేరుకున్నాడు. కెరీర్ లో 25వ సినిమా పూర్తి చేశాడు. తన మెంటార్ ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ‘వి’సినిమా నానికి 25వది. సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ మూవీలో నానిని కాస్త నెగెటివ్ టచ్ ఉండే పాత్ర అంటున్నారు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ మూవీని ఈ నెల 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ డేట్ నుంచి పోస్ట్ పోన్ అయింది వి. అదే రోజున రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా, యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలు కూడా వస్తున్నాయి. దీంతో నాని వారికి భయపడ్డాడా అనే భావన చాలామందిలో ఉంది. కానీ అంత లేకపోవచ్చు.
నాని ఈ నెల 25 నుంచి వచ్చి ఏప్రిల్ 17 వరకూ వెళ్లిపోవడం విశేషం. అదే రోజున కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మిస్ ఇండియా’ కూడా విడుదలవుతోంది. ఆ సినిమాతో నానికి వచ్చిన ప్రాబ్లమ్ ఏం ఉండకపోవచ్చు. నిజానికి ఈ మూవీ విజయమైనా, పరాజయమైనా నాని షేర్ చాలా తక్కువ. ఎందుకంటే అతనిది పూర్తి స్థాయి పాత్ర కాదు. కేవలం అరగంట మాత్రమే ఉండే క్యారెక్టర్. కానీ ఆ క్యారెక్టర్ చుట్టే సినిమా అంతా రన్ అవుతుంది. కాకపోతే ఇది నానికి 25వ సినిమా కాబట్టే అంతా అతన్ని ఫోకస్ చేస్తున్నారు.

Related Articles

Back to top button
Send this to a friend