నాని పాత్రలో నటిస్తోన్న నిఖిల్ ..!
యంగ్ స్టార్ నిఖిల్ లేటెస్ట్ మూవీ ‘18పేజెస్’.అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ఇది. కృతిశెట్టి, అను ఇమ్మానుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కుమారి 21ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకుడు. రీసెంట్ గా అర్జున్ సురవరం సినిమాతో మంచి విజయం అందుకున్న నిఖిల్ ఈ సారి మరింత వైవిధ్యమైన కథతో వస్తున్నాడు అని టైటిల్ చూస్తేనే తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ ను బట్టి ఇందులో కొన్ని పేజెస్ మిస్ అవుతాయట. అదే సినిమాకు కీ పాయింట్ అంటున్నారు.
ఆ పాయింట్ ను బట్టి చూస్తే ఇది గతంలో నాని, మారుతి దర్శకత్వంలో వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమాను గుర్తుకు చేస్తోంది. ఎందుకంటే ‘18పేజెస్’లో నిఖిల కు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఉటుందట. అంటే అతను కొన్ని విషయాలను కొంత కాలం పాటు మర్చిపోతాడు. మళ్లీ ఎప్పటికో గుర్తొస్తాయి. కానీ అప్పటికే ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటాడట. అతను మిస్ అయిన ఆ మెయిన్ ఇష్యూస్ అన్నీ ఈ ‘18పేజెస్’లో ఉంటాయా లేక ఈ టైటిల్ కు మరేదైనా కారణం ఉందా అనేది చూడాలి. మొత్తంగా నాని క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ లో నిఖిల్ కనిపించబోతున్నాడన్నమాట.