నాని కోసం రీ షూట్ కు వెళుతున్నారా..?


నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘వి’. ఈ మూవీలో అతను కాస్త నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో నటించాడు. సుధీర్ బాబు మెయిన్ హీరో. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కావాల్సింది. గతంలోనే పోస్ట్ పోన్ చేశారు. అందుకు కారణం కరోనా వైరస్ ప్రభావం కాదు. అంతకు ముందే సినిమాను వాయిదా వేశారు. కారణం ఏంటా అని అంతా అనుకున్నారు. అయితే మూవీ చూసిన తర్వాత అనుకున్నట్టుగా రాలేదట. పైగా నాని పాత్ర చిన్నది కావడం.. కంటెంట్ వాల్యూ ఎక్కువగా ఉండటంతో ఆ కంటెంట్ ను సుధీర్ బాబు మోయడం కష్టం అనిపించిందట. అందుకే మరికొన్ని కీలకమైన సన్నివేశాలను నానిపై చిత్రీకరించేందుకే ఈ వాయిదా అనేది తాజా వార్త.
నాని చుట్టే కథనం తిరిగినా.. సినిమాలో అతని పాత్ర నడివి 30 నిమిషాలే. మిగతా అంతా సుధీర్ బాబుదే. కానీ మొత్తం అయ్యాక చూస్తే నాని లేకుండా అంత సేపు సుధీర్ బాబుతో ఈ కథను నడిపితే మొదటికే మోసం వస్తుందని గ్రహించారట. అందుకే ఈ రీ షూట్ అంటున్నారు. ఇక ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో అన్ని షూటింగ్ లు బంద్ అయ్యాయి కాబట్టి.. మళ్లీ అంతా క్లియర్ అయ్యాకే షూటింగ్ మొదలవుతుంది. అంటే వాళ్లు చెప్పినట్టుగా ఏప్రిల్ 17న కూడా ‘వి’విడుదల కాదు. మొత్తంగా నాని సీన్స్ ను రీ షూట్ చేయడం కోసమే ఈ సినిమా వాయిదా పడిందన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend