నాగచైతన్యను ఇబ్బంది పెడుతోన్న సాయిపల్లవి

నాగ చైతన్య .. కొన్నాళ్ల క్రితం మాస్ మోజులో పడిపోయి మూస సినిమాలతో లాసులు చూశాడు. కెరీర్ ప్రశ్నార్థకంలో ఉన్న టైమ్ లో చేసిన ప్రేమమ్ లక్ ఇస్తే.. మజిలీ మనోడి ‘స్ట్రెంత్’ ను చూపించింది. మాస్ హీరోగా చైతూకు అంత సీన్ లేదనేది తేలిపోయింది. అందుకే క్లాస్ లో ట్రై చేస్తూ విజయాలు అందుకుంటున్నాడు. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో సినిమా చేస్తన్నాడు. ‘లవ్ స్టోరీ’పేరుతో రూపొందుతోన్న ఈమూవీని మే లేదా జూలైలో విడుదల చేస్తారు. నిజానికి మొదట్లో ఏప్రిల్ 2 తర్వాత ఏప్రిల్ 17 అనుకున్నారు. బట్.. ఆ టైమ్ కు సినిమా సిద్ధం కావడం అసాద్యం అని తేలిపోయింది. అయితే మూవీకి సంబంధించి ఓ విషయంలో సాయి పల్లవి, నాగచైతన్యను ఓ రేంజ్ లో ఇబ్బంది పెడుతోంది అనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
సాయిపల్లవి బెస్ట్ డ్యాన్సర్. ఆల్రెడీ తను కాంపిటీషన్స్ లో కూడా ప్రూవ్ చేసుకుంది. ఈ లవ్ స్టోరీ డ్యాన్స్ బేస్డ్ సినిమా. అది సాయిపల్లవికి చాలా సులువు. అయితే ఆమెను మ్యాచ్ చేయడం నాగ చైతన్య వల్ల కావడం లేదట. మామూలుగానే నాగ చైతన్య అంత మంచి డ్యాన్సర్ కాదు. ఏదో మ్యానేజ్ చేస్తాడు. అలాంటి ఇలాంటి సినిమాలో అదీ సాయి పల్లవిని మ్యాచ్ చేయడం అంటే సులభమా. అందుకే అతను ఎక్కువ టేకులు తీసుకుంటున్నాడట. కొన్ని సీక్వెన్స్ లు అనుకున్న టైమ్ కు పూర్తి కాకపోవడానికి ఈ టేకులు కూడా ఓ కారణం అంటున్నారు. అయితే సాయిపల్లవి మాత్రం అన్నీ సింగిల్ టేకులేనట. మరి డ్యాన్స్ రాని చైతూని ఈ ప్రాజెక్ట్ లోకి ఎందుకు తీసుకున్నారు అనిపిస్తోందా.. నిజమే.. కానీ రాని వాడితే చేయిస్తేనే కదా.. దర్శకుడు రాణించాడు అని చెప్పుకుంటారు.

Related Articles

Back to top button
Send this to a friend