నయనతార మెడలు వంచిన కోలీవుడ్ !

Nayanatara agrees for Producer's demands

నయనతార.. అతి సాధారణంగా మొదలైంది తన కెరీర్. కానీ అసాధారణంగా ఎదిగింది. కెరీర్ లోనే కాదు.. పర్సనల్ లైఫ్ లోనూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి. అయితేనేం అన్నిటినీ తట్టుకుని నిలబడింది. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల స్తాయిలో తన సినిమాలు కలెక్షన్స్ సాధిస్తున్నాయి. అందుకే ఎక్కువగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. ఇదే టైమ్ లో ఇమేజ్ తో పాటు అమ్మడిలో కాస్త హెడ్ వెయిట్(కోలీవుడ్ ఇదే మాట అంటుంది)కూడా పెరిగింది. ఆ కారణంగా ఓ సినిమాకు అనేక కండీషన్స్ పెడుతోంది. అన్నిటికీ ఒప్పుకుని నిర్మాతలు చెక్కులు ఇస్తున్నారు. అయితే వీటిలో దారుణమైనది ఏంటంటే.. తను సినిమా ప్రమోషన్స్ కు రాదు.
ఓ స్టార్ హీరోయిన్ ప్రమోషన్ కు వస్తే అది సినిమాకు ఎంత ఉపయోగపడుతుంది అని నయన్ కు కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ తను మాత్రం రాదు. అటు స్టార్ హీరోలతో నటించినా సరే.. నో ప్రమోషన్స్ అంటుంది. ఈ వ్యవహారంపై చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. రీసెంట్ గా విజయ్, రజినీకాంత్ సినిమాలకు సైతం ప్రమోషన్స్ చేయలేదు. దీంతో నిర్మాతల మండలిలో చర్చించి నయన్ ప్రమోషన్స్ కు రాకపోతే తనపై వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. తమిళ్ నిర్మాతలంటే మనవాళ్లలా కాదు.. అన్నారంటే చేస్తారు. అందుకే దిగి వచ్చింది నయనతార.
ఇకపై తను ప్రమోషన్స్ కు వస్తాను అని చెబుతోంది. చిన్న సినిమాలకు కూడా ప్రమోషన్ చేస్తాను అని ప్రకటించింది. అయితే ఇది కేవలం నిర్మాతలకు భయపడి మాత్రమే కాదు.. ఈ మధ్య తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోతున్నాయి. అలాగే కెరీర్ కూడా చివరి స్టేజ్ కు వచ్చింది. ఈ టైమ్ లో బెట్టు చేస్తే మొత్తానికే మోసం వస్తుంది. అది గ్రహించే అమ్మడు పాత పాటను కొత్తగా అందుకుంది.

Related Articles

Back to top button
Send this to a friend