ద్వాపర యుగానికి వెళుతోన్న కార్తికేయ-2

కార్తికేయ.. యానిమల్ హిప్నాటిజం అంటూ ఓ కొత్త కాన్సెప్ట్ ను తెలుగు సినిమాకు పరిచయం చేసిన సినిమా. నిఖిల్ హీరోగా వచ్చిన ఈ చిత్రంతోనే చందు మొండేటి దర్శకుడుగా పరచయం అయ్యాడు. అయితే రీసెంట్ గా అతను ఓ డిజాస్టర్ సినిమాతో నిరాశపరిచాడు. దీంతో గతంలోనే అనౌన్స్ చేసినట్టుగా ఇప్పుడు కార్తికేయ కు సీక్వెల్ తో వస్తున్నారు. ఈ సీక్వెల్ కు సంబంధించిన కథను బ్రీఫ్ చేస్తూ ఓ వీడియో వదిలారు. ఏనిమేటెడ్ గా సాగే ఈ వీడియో చూస్తే ఇది ద్వాపరయుగంలో వదిలివేయబడ్డ ఓ సీక్రెట్ ను ఛేదించబోతోన్న సినిమా అని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే వీడియోలో మంచి వాయిస్ ఓవర్ కూడా అందించి ఈ సీక్వెల్ ఎలా ఉండబోతోందని చెప్పకనే చెప్పారు.
ఇక నిఖిల్ పెళ్లి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ గా ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. నిఖిల్ కూడా నితిన్ లానే ఈ ఏప్రిల్ లోనే మూడు ముళ్లు వేయబోతున్నాడు. మొత్తంగా ఈ కాంబినేషన్ పై ఉండే క్రేజ్ ను ఈ వీడియో రెట్టింపు చేసిందనే చెప్పాలి.

Related Articles

Back to top button
Send this to a friend