త్రిషకు షాక్ ఇచ్చిన నిర్మాత

నిన్నటి స్టార్ అండ్ సీనియర్ హీరోయిన్ త్రిష లేటెస్ట్ మూవీ ‘పరమపదం వెలయాట్టు’. కొడి తర్వాత త్రిష చేసిన పొలిటికల్ థ్రిల్లర్ ఈ సినిమా. కాస్త హీరోయిన్ సెంట్రిక్ గా కనిపించే ఈ సినిమా రేపు విడుదల కావాల్సి ఉంది. కానీ లేటెస్ట్ గా వినిపిస్తోన్నదాన్ని బట్టి మూవీ పోస్ట్ పోన్ అయిందట. అందుకు కారణాలు ఖచ్చితంగా తెలియడం లేదు కానీ కొన్ని రోజులుగా ఈ సినిమా నిర్మాత త్రిషపై ఓ రేంజ్ లో ఆరోపణలు చేస్తూ వస్తున్నాడు. అలాగే తనపై నిర్మాతల మండలిలోనూ కంప్లైంట్ చేసి ఉన్నాడు. అందువల్ల అతనే సినిమా ఆపుతాడు అనుకోలేం. ఏదైనా ఉంటే మండలిలోనే చూసుకుంటారు కదా.
కొన్ని రోజుల క్రితం ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. సినిమాకు చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అయిన ఈ ప్రోగ్రామ్ కు త్రిష అటెండ్ కాలేదు. మరి తన కారణాలు(ఇప్పటి వరకూ చెప్పలేదు)ఏమున్నాయో కానీ.. ఆ రోజున ఆ చిత్ర నిర్మాత టి శివ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. త్రిషతో పాటు పనిలో పనిగా నయనతారపైనా ఆరోపణలు చేశాడు.సినిమా ప్రమోషన్స్ కు రాని హీరోయిన్లపై చర్యలు తీసుకోవాలని నిర్మాతల మండలిలో ప్రతిపాదన కూడా పెట్టాడు. మొత్తంగా ఇన్ని కాంట్రవర్శీస్ నడుమ సినిమా విడుదల కూడా ఆగిపోవడం త్రిషకు మరో షాక్ అనే చెప్పాలి.
ఇక త్రిష 60వ సినిమాగా వస్తోన్న ఈచిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఇంకా క్లియర్ కాలేదు.

Related Articles

Back to top button
Send this to a friend