తెలంగాణ బిజెపి అధ్యక్షుడుగా బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను నియమించారు. యువతలో గట్టిపట్టున్న బండి సంజయ్‌కు బీజేపీ అధిష్టానంతో పాటూ ఆర్ఎస్ఎస్‌తోనూ సత్సంబంధాలున్నాయి. 2018 నవంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన.. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్ తన నియోజకవర్గంతో పాటు తెలంగాణ అంతటా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో బిజెపి విషయంలో చాలా చురుకుగా కనిపిస్తున్నాడు. కార్యకర్తలను ఉత్తేజితం చేసేలా ప్రసంగించడంలో కూడా ఈయనకు మంచి ప్రతిభ ఉంది. నిజానికి మరోసారి బంగారు లక్ష్మణ్ కే ఇస్తారు అనుకున్నారు. అటు కిషన్ రెడ్డి కూడా ఆలోచనలో ఉన్నా.. ఆయన కేంద్ర సహాయ మంత్రిగా బిజీగా ఉన్నాడు. ఈ తరుణంలో కాస్త యాక్టివ్ గా కనిపిస్తున్న సంజయ్ మంచి ఆప్షన్ గా కనిపించాడు. అందుకే సంజయ్ కే తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పజెప్పింది భారతీయ జనతా పార్టీ.

Related Articles

Back to top button
Send this to a friend