తిరుపతీ క్లోజ్ అయిందా గోవిందా..?

కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచం అంతా వణికిపోతోంది. ఇప్పటికే ఎన్నోదేశాలు షట్ డౌన్ దిశగా వెళుతున్నాయి. కాస్త ఆలస్యంగా అయినా మనదేశం కూడా మేల్కొంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో అమలవుతోన్న బంద్ క్రమక్రమంగా దేశమంతా విస్తరిస్తోంది. అత్యధిక జనం వచ్చే అన్ని ప్రాంతాలూ మూసివేస్తున్నారు. స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, పార్కులు, సినిమా థియేటర్స్ తో పాటు కొన్ని దేవాలయాలు కూడా మూసేశారు. ఇప్పుడు తాజాగా తిరుపతి వెంకన్నస్వామి ఆలయం కూడా మూసివేస్తున్నారు.
ఇప్పటికే కరోనా భయంతో తిరుపతికి సందర్శకుల రద్దీ తగ్గింది. మొన్నటి వరకూ ఆలయానికి చాలా దూరంలోనే తనిఖీలు నిర్వహించారు. ఇప్పుడు ఏకంగా దేవాలయాన్నే మూసివేస్తున్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకూ తిరుపతి ఆలయం మూసివేయబడుతుంది ఏపి మంత్రి ఆళ్ల నాని ప్రకటించాడు. ఇటు తెలంగాణలోనూ వీసాల దేవుడుగా పేరు తెచ్చుకున్న చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సైతం మూసివేశారు. మొత్తంగా కోవిడ్ -19 దెబ్బకు దేవుళ్లు సైతం విలవిలలాడుతున్నారన్నమాట.

Related Articles

Back to top button