తమ్మారెడ్డి.. ఇంత దురుసు ఎందుకు

తెలుగులో ఒకప్పుడు సినిమాలు చేసి కొన్నాల్లుగా తన సినిమాలతో జనాల్ని ఆకట్టుకోలేక కామ్ గా ఉంటున్నాడు నిన్నటి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అయితే ఔత్సాహిక దర్శకులను ప్రోత్సహించడం.. అప్పుడప్పుడూ మీడియా వారికి అవసరమైన బైట్స్ ఇవ్వడంలో ముందుంటున్నాడు. ఆయన వద్ద లేని సమాచారం ఉండదు అంటారు. అందుకే మినీ స్టార్ నుంచి మెగాస్టార్ వరకూ విమర్శిస్తాడు. ‘అవసరమైతే’మళ్లీ ఆళ్లే గ్రేటూ అని కూడా అనగల సమర్థుడు. మొత్తంగా చాలా గ్యాప్ తర్వాత తాజాగా వచ్చిన పలాస 1978 చిత్రానికి సమర్పకుడుగా ఉన్నాడు. ఈ శుక్రవారం విడుదలైన సినిమా గురించి ఆయన మాట్లాడుతూ దళితులను కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేశాడు.
” ఒక మంచి సినిమా కావాలి అంటారు..మంచి రివ్యూ లు కావాలి అంటారు..అవన్నీ ఉన్న సినిమా పలాస 1978. దళితులు పాత్ర లు  సినిమాల్లో ఉండవు.. దళిత కథ లు సినిమా గా మారవు అంటారు.. కానీ పలాస లో వారి పాత్రలను హీరో లను చేసాము..వారి సమస్యలను చర్చించాము.. కానీ వారి నుండే స్పందన కరువైంది. మీ సినిమాలు మీరు కూడా చూడక పోతే మీ ఖర్మ. మీరు చూసి ఆశీర్వదిస్తే..మరిన్ని సినిమాలు వస్తాయి..ఇది నా ఆవేదన..నా నలభై ఏళ్ల కెరియర్ లో ఏ సినిమా ఆడినా, అడకపోయినా బాధ పడలేదు..కానీ ఈ సినిమా విషయంలో మేము సక్సెస్ అయ్యాం..కానీ ఈ సినిమా మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత దళితులదే” … ఇవీ తమ్మారెడ్డి వ్యాఖ్యలు. దీంతో ఆయా వర్గాల వాళ్లు ఆయనపై మండిపడుతున్నారు. ఏదో దళితోద్ధరణ చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఇందులో దళిత నటులు ఎంతమంది ఉన్నారు. వర్తమాన సామాజిక సమస్యల గురించి ఏ మేరకు సినిమాలో చర్చించారు అంటూ విమర్శలు చేస్తున్నారు. దీంతో నాలిక్కరుచుకున్న ఆయన రకరకాల ఉపమానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైనా తను ఏమన్నా చెల్లిపోతుంది అనే దురుసుతనంతో కూడిన అహంకారం ఆయన మాటల్లో కనిపిస్తోంది అంటూ కొందరు దళిత్ యాక్టివిస్ట్స్ వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

Back to top button