తమన్నా కావాలంటోన్న దర్శకుడు


తమన్నా.. హీరోయిన్ గా కెరీర్ చివరిదశలో ఉంది. ఇప్పటికే దాదాపు పదిహేనేళ్లు కావొస్తుంది తను ఇండస్ట్రీకి వచ్చి. తను ఊహించినంత అని చెప్పలేం కానీ ఓ రేంజ్ లో పాపులారిటీ అయితే వచ్చింది. కానీ ఏ దశలోనూ తను నెంబర్ వన్ అనిపించుకోలేదు అనేది మాత్రం నిజం. టాప్ స్టార్స్ అందరితో  చేసింది. కానీ టాప్ హీరోయిన్ గా డిక్లేర్ కాలేకపోయింది. అయినా ఎప్పుడూ బిజీగానే ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన ‘సీటీమార్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో తను గాళ్స్ కబడ్డీ కోచ్ గా ఫస్ట్ టైమ్ ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లోని పాత్రను చేస్తోంది. విశేషం ఏంటంటే ఈ మూవీ తప్ప తన చేతిలో మరో ప్రాజెక్ట్ లేదు. ఈ టైమ్ లో ఓ దర్శకుడు నా కథకు నువ్వే కరెక్ట్ అని అడుగుతున్నాడు. మరి కాదంటుందా..?
నక్కిన త్రినాథరావు.. సాధారణ కథలతోనే తన హీరోలను డిఫరెంట్ గాప్రజెంట్ చేసి కమర్షియల్ విజయాలు అందుకునే దర్శకుడు. అయితే ఇతనికి కూడా కాన్ స్టంట్ గా సినిమాలుండవు. అందుకు కారణాలేవైనా.. ఈ మధ్య ఓ కథతో చాలామంది హీరోలను కలిశాక ఫైనల్ గా రవితేజ ఓకే చేశాడు. ఈ మూవీతో పాటు రవితేజ మరో ఇద్దరు దర్శకులకు కూడా కమిట్ అయి ఉన్నాడు. కాకపోతే త్రినాథరావు కథ బాగా నచ్చిందట. అందుకే ముందు ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఇక కథ ప్రకారం ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ అయితే బావుంటుంది అనేది దర్శకుడి ప్లాన్. అవన్నీ రవితేజ పెద్దగా పట్టించుకోడు.. పైగా తమన్నాతో ఆల్రెడీ బెంగాల్ టైగర్ చిత్రంలో చేసి ఉన్నాడు. అందుకే తననే ఈ సినిమాలో తీసుకునే ఛాన్స్ ఉంది. అలా తమన్నా అకౌంట్ లో మరో సినిమా పడబోతోందన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend