హర్రర్ సినిమా ” నరుడి బ్రతుకు నటన”

తనికెళ్ల భరణి, తల్లాడ సాయికృష్ణ, మాధురి చిగురు ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ” నరుడి బ్రతుకు నటన”. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా చేస్తున్నాడు. జానీ దర్శకుడు గా పరిచయం అవుతున్న ఈ సినిమా 70% టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత “తల్లాడ శ్రీనివాస్ ” మాట్లాడుతూ మా బ్యానర్లో మంచి బడ్జెట్ తో నిర్మిస్తున్న హర్రర్ సినిమా ఇది. శివ కాకు అందించిన కథ ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది.ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ షూటింగ్ నిర్వహించాము, మరొక షెడ్యూల్ తో టాకీ పార్ట్ పూర్తి అవుతుంది.

దర్శకుడు “జానీ ” మాట్లాడుతూ జర్నలిస్ట్ గా వృత్తి నిర్వహిస్తున్న కానీ దర్శకత్వం చేయాలనేది నా ప్రవృత్తి, ఈ సినిమా తో ఆ కోరిక కూడా నెరవేరింది. హీరో ,హీరోయిన్ ల నటన,మంచి కథ,మంచి ప్రొడక్షన్ హౌస్, ఫైట్ మాస్టర్ శ్యామ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ పనితనం, డెడికేషన్ తో వర్క్ చేసే టీం ఉండడం వలన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అని అనుకుంటున్నానను.

హీరో “తల్లాడ సాయికృష్ణ” మాట్లాడుతూ నేను చేసిన మూడు సినిమాలు డిఫరెంట్ కథలతోనే ఉంటాయి. నరుడి బ్రతుకు నటన కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. షూటింగ్ టైమ్ లో ఐతే హీరోయిన్ మాధురి తో, ప్రతి నాయకుడు అవినాష్ , నా తోటి నటులు బేబి హానీ, బాలు,సంతోష్,రంజిత్ లతో బెస్ట్ అవుట్ ఫుట్ యాక్టింగ్ కోసం పోటీ పడి మరీ నటించాం.ప్రభుత్వ సూచనలు పాటిస్తూ తదుపరి షెడ్యూల్ షూటింగ్స్ ని ప్లాన్ చేసుకొని పూర్తి చేస్తాం.

బ్యానర్ :
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్

సినిమా :
“నరుడి బ్రతుకు నటన”

నిర్మాత : తల్లాడ శ్రీనివాస్
దర్శకుడు : జానీ
కథ మాటలు : శివ కాకు
కెమెరా : శ్యాం & శ్రీకాంత్
ఆర్ట్: యాటగాని పవన్
ఫైట్స్ : శ్యామ్ కరద
ఏడిటింగ్ : శ్రీకాంత్ కురెళ్లి
పి.ఆర్.ఓ : పవన్ పాల్.

Related Articles

Back to top button