తగ్గేదే లేదంటోన్న నితిన్

భీష్మ మంచి హిట్ కావడంతో మరింత జోష్ గా ఉన్నాడు నితిన్. మామూలుగా ఈ ఏప్రిల్ లో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ఎఫెక్ట్ తో అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యేలా ఉంది. అయితే సినిమాల విషయంలో మాత్రం మనోడు తగ్గేదే లేదంటున్నాడు. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉణ్నాయి. ఇందులో వెంకీ అట్లూరి డైరక్షన్ లో చేస్తోన్న ‘రంద్ దే’చివరికి వచ్చేసింది. మామూలుగా ఈ మే నెలలో విడుదల చేయాలని డేట్ అనౌన్స్ చేశారు కూడా. ఇక దసరా టైమ్ కు చంద్ర శేఖర్ ఏలేటి డైరెక్షన లో చేస్తోన్న ‘చెక్’ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. అదే టైమ్ లో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అంధాధూన్ రీమేక్ కు సైతం ముహూర్తం పెట్టేసుకున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న సినిమా ఇది. అయితే వీటితో పాటు మరో సినిమా కూడా లైన్లో పెట్టుకున్నాడు నితిన్. పైగా అది ప్యాన్ ఇండియన్ సినిమా అన్నాడు కూడా. ఆ సినిమా కోసం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవసరమైతే వీటిలో ఏదో ఒక సినిమాకు కాస్త గ్యాప్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు.
లిరిసిస్ట్ నుంచి దర్శకుడుగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ ప్యాన్ ఇండియన్ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో నతిన్ వైవిధ్యమైన ఏజ్ గ్రూప్స్ లో కనిపిస్తాడు. అంటే 18యేళ్లలో ఓ కథ, 40యేళ్ల టైమ్ లో ఓ కథ. అక్కడి నుంచి 60యేళ్ల వరకూ సాగే కథ ఒకటి. అంటే ఒకే సినిమాలో మూడు ఏజ్ గ్రూప్స్ లో కనిపిస్తాడన్నమాట. మరి తనలాంటి యంగ్ స్టర్ కు ఇలాంటి కథ వస్తే సులువుగా టెంప్ట్ అవుతాడు. అటు కృష్ణ చైతన్య తొలి సినిమాతో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. తర్వాత నితిన్ తోనే చేసిన ఛల్ మోహన రంగా ఆకట్టుకోకపోయినా అతని కేపబిలిటీనీ నమ్మే నితిన్ ఈ ప్రాజెక్ట్ ను ఒప్పుకున్నాడు.
ఇక ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని బట్టి .. ఇప్పుడు చేస్తోన్నసినిమాల సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా ఈ ప్యాన్ ఇండియన్ సినిమాను మాత్రం ఖచ్చితంగా జూన్ లోనే ప్రారంభించాలనుకుంటున్నారట. ఏదేమైనా ఇప్పుడు నితిన్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇందులో రెండు ఈ యేడాది విడుదలవుతాయి. మిగతా రెండు నెక్ట్స్ ఇయర్ వచ్చేస్తాయి. మొత్తంగా లేట్ అయినా ఘాటుగా వస్తున్నాడు నితిన్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend