డిజాస్టర్ డైరెక్టర్ తో అనుష్క నెక్ట్స్ సినిమానా..?


స్వీటీ బ్యూటీ అనుష్క .. ప్రస్తుతం తను నటించిన నిశ్శబ్ధం ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ఫిఫ్టీన్ ఇయర్స్ జర్నీ గురించి కూడా ప్రత్యేకంగా ఓ ప్రోగ్రామ్ చేశారు. అక్కడికి వచ్చిన వాళ్లంతా అనుష్కను పొగడ్తల్లో ముంచేసింది. అయితే సినిమా గురించి మాట్లాడిన వాళ్లు తక్కువ. చివరికి అనుష్కతో సహా. ఇంతకీ ఆ సినిమా ఎలా ఉంది.. అంటే ట్రైలర్ ను బట్టి ఆడియన్స్ ఏ అంచనాలకు వచ్చారో అంతే అనుకోవాలేమో. ఇక ఈ సినిమాలో అనుష్క, మూగ, చెవిటి అమ్మాయిగా నటించింది. ఛాలెంజింగ్ రోల్ కాబట్టి.. తనూ ఎంజాయ్ చేసి ఉంటుంది. అయితే నిశ్శబ్ధం తర్వాత తను ఓ దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పిందనే వార్తలు టాలీవుడ్ కు షాక్ ఇస్తున్నాయి. కారణం ఆ దర్శకుడి మొదటి సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్.
ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో తెలుసా.. మహేష్ పి. ఈ పేరు కూడా ఎక్కడా విన్నట్టుగా అనిపించడం లేదు కదూ. నిజమే ఒక సినిమాకే మనోడి ప్రతిభ తెలిసింది కాబట్టే టాలీవుడ్ కూడా పక్కన బెట్టిందేమో. మరి ఈ దర్శకుడు చేసిన సినిమా ఏంటో తెలుసా.. సందీప్ కిషన్, రెజీనా జంటగా ఆ మధ్య వచ్చిన ‘రారా కృష్ణయ్య’. అయితే ఒక్కోసారి ఇలాంటి దర్శకులు మిరకిల్స్ చేస్తుంటారు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగిందీ అంటే అసలు ఈ రూమర్ రావడమే.
కాకపోతే ఈ రూమర్ వెనక మరో కారణం ఏంటంటే.. ఈ కుర్రాడు ఓ పెద్ద నిర్మాణ సంస్థను ఒప్పించాడనీ.. వాళ్లే అనుష్కను కన్విన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఏదేమైనా అనుష్క ఇక రెగ్యులర్ హీరోయిన్ గా పనిచేయదు. అందువల్ల ఇది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని వేరే చెప్పక్కర్లేదు. ఏదేమైనా ఈ వార్త ప్రస్తుతానికైతే రూమరే.. ఎవరో ఒకరు కన్ఫార్మ్ చేస్తే కానీ అసలు యవ్వారం తెలియదు.

Related Articles

Back to top button
Send this to a friend