తొలిసారిగా అమెరికా అధినేత ట్రంప్ వచ్చాడు..
డోనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యం అమెరికా అధినేత. తొలిసారిగా భారత పర్యటనకు వచ్చాడు. ట్రంప్ తో పాటు భార్య ఇవానియా, కూతురు ఇవాంక, అల్లుడు ఇష్నర్ కూడా వచ్చారు. ‘నమస్తే ట్రంప్’ పేరుతో వీరికోసం భారత్ భారీ స్వాగత ఏర్పాట్లు చేసుకుంది. అయితే అంతకు మించిన జాగ్రత్తలు తన సైన్యంతో చేయించుకున్న తర్వాతే దిగాడు ట్రంప్. తన సొంత విమానంలో గుజరాత్ లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో దిగిన ట్రంప్ కు మోడీ అండ్ కో అఖండ స్వాగతం పలికింది. అటుపై గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ కాసేపు గడిపిన తర్వాత ఇవాంక, ట్రంప్ గాంధీ నూలు వడికిన రాట్నం గురించి స్వయంగా తెలుసుకున్నారు.
అక్కడి నుంచి ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం మొతెరాను ను ట్రంప్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే మొతేరా స్టేడియంలో ట్రంప్ దంపతులు భారతీయ సైనిక త్రివిధ దళాలు సమర్పించిన గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమం ఆసాంతం భారతీయ సంప్రదాయ పద్ధతిలోనే కొనసాగడం విశేషం. తర్వాత మోడీ ఇండియా- అమెరికా స్నేహాన్ని గురించి మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు ఎందరో హాజరయ్యారు. దాదాపు లక్షల పదివేల మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.