ట్రంప్ పర్యటన ఖర్చుపై రామ్ గోపాల్ వర్మ పంచ్!!
ఎన్నో విషయాల్లో కాంట్రవర్శీయల్ ట్వీట్స్ తో అదరగొట్టే వర్మ అప్పుడప్పుడూ ఆలోచనాత్మక ట్వీట్స్ తోనూ రాజకీయా పార్టీల అజ్ఞానంపై అద్భుతమైన సెటైర్స్ వేస్తుంటాడు. కొన్నిసార్లు చూస్తే అతనికి మాత్రమే వచ్చే ఆలోచనలు కనిపిస్తాయి. అవి ఎంతోమందిని కదిలిస్తాయి కూడా. ఈ మధ్య మరీ చీప్ గా మారినా.. కొన్నిసార్లు ట్వీట్స్ తో దటీజ్ వర్మ అనిపిస్తాడు. తాజాగా నమస్తే ట్రంప్ అంటూ దేశమంతా ఊగిపోతోన్న వేళ ట్రంప్ కోసం గుజరాత్ ప్రభుత్వం నిమిషానికి 55 లక్షలు ఖర్చు పెడుతూ మేమేమో గొప్ప అన్నట్టుగా బిల్డప్ ఇస్తోన్న టైమ్ లో రామ్ గోపాల్ వర్మ సంధించిన ఓ ప్రశ్న నిజంగా మన నాయకులకు, నాయకులను గుడ్డిగా ఫాలో అవుతోన్న కార్యకర్తలకు కనువిప్పు కావాలి. ఇంతకీ వర్మ ఆ ట్వీట్ లో ఏం చెప్పాడో తెలుసా..?
‘‘మన భారతీయులం విదేశీ అధ్యక్షుడు ట్రంప్ వస్తే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. కానీ ఇదే నరేంద్ర మోడీ అమెరికా వెళితే అక్కడి యూఎస్ గవర్నమెంట్ కనీసం వేల రూపాయలైనా ఖర్చు చేస్తుందా..? అది ఏం చెబుతుందంటే అమెరికా అని.. ఇది ఇండియా కాదు అని.. జస్ట్ చెబుతున్నానంతే’’ అంటూ అద్భుతమైన ట్వీట్ చేశాడు.
నిజమే.. మనమే కాదు.. ఏ ఇతర దేశాల ప్రధానులు, అధ్యక్షులు వెళ్లినా అమెరికా కేవలం వారికి భద్రత మాత్రమే ఇస్తుంది తప్ప మరే రకంగానూ మనకోసం ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయదు. అక్కడి భారతీయులే మన ప్రధాని ఖర్చులు భరిస్తారనేది ఎంతమందికి తెలుసు.