టివి9ను మార్చారు..?

టివి9.. తెలుగునాట తొలి శాటిలైట్ న్యూస్ ఛానల్ గా అది సృష్టించిన సంచలనాలకు లెక్కేలేదు. తొలి 24గంటల వార్తా ఛానల్ గా టివి9 ఆరంభం, నడక ఓ సంచలనం. ఈ క్రమంలో ఎందరో జర్నలిస్ట్ లకు కొత్త లైఫ్ ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఛానల్ స్ఫూర్తితోతోనే ఇప్పుడు తెలుగులో మరే రాష్ట్రంలో లేనన్ని శాటిలైట్ ఛానల్స్ పుట్టుకు వచ్చాయి. సిఇవో రవిప్రకాష్ నేతృత్వంలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిందీ ఛానల్. ఈ క్రమంలో న్యూస్ తో పాటు చాలాసార్లు న్యూసెన్స్ ను కూడా క్రియేట్ చేసింది. వార్తా ప్రపంచంలో ఓ మోనోపలీకీ తెరలేపింది. తాము చెప్పిందే రైట్ అనే ఈనాడు ధోరణికి టివి రూపంగానూ ఈ టివి9ను చెబుతారు చాలామంది. మొత్తంగా యేడాది క్రితం అనూహ్య పరిణామాల మధ్య రవిప్రకాష్ అరెస్ట్ కావడం.. అతన్ని ఛానల్ తొలగించడం వంటి కార్యక్రమాలతో కూడా టివి9 సెన్సేషన్ అయింది. దీని వెనక అక్రమార్జిత రాజకీయ లాభాపేక్షలు ఎన్నో ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఇక రవి ప్రకాష్ వెళ్లిపోయిన తర్వాత ఆ ఛానల్ ఉద్యోగులు చాలామంది అతన్ని అనుసరిస్తారు అనుకున్నారు. బట్ ఒక్కరు కూడా బయటకు వెళ్లలేదు. ఈ క్రమంలో అది రవి ప్రకాష్ ముద్రను వదిలించుకోవడం ప్రారంభించింది. కొన్ని నాన్సెస్ లు తప్ప వదిలించుకుంది కూడా అనుకోవచ్చు. ఈ క్రమంలోఏకంగా ఛానల్ లోగోను కూడా మార్చేస్తున్నారు.
ఇదుగో మీరు చూస్తున్న ఈ లోగోనే ఇకపై టివి9కొత్త లోగోగా ఉండబోతోంది. ఆ విషయాన్ని ఛానల్ లో అత్యంత కీలక ఉద్యోగిగా చెప్పుకునే రజినీకాంత్ ట్విట్ చేశాడు. తెలుగుతో పాటు అన్ని భాషల నెట్ వర్క్స్ కూ ఈ లోగోనే వాడబోతున్నారు.  ఈ లోగోతో పాటు కొన్ని రంగులు మారాయి. డిజైన్ లో కొన్ని మార్పులు కూడా చేశారు. కానీ ఒరిజినల్ లోగో ‘ఫ్లేవర్’ను మాత్రం అలాగే ఉంచారు.

Related Articles

Back to top button
Send this to a friend