టామ్ అండ్ జెర్రీ తాత ఇక లేరు..
పిల్లల కు ఎంతగానో ఇష్టమైన కార్టూన్ షో టామ్ అండ్ జెర్రీ దర్శకుల లో ఒకరైన జీన్ డీచ్ మృతి చెందారు.ఆయన వయస్సు 95సంవత్సరాలు.జీన్ యానిమేటర్,దర్శకుడు, నిర్మాతే కాదు ,ఎంతో ప్రతిష్టాత్మక మైన ఆస్కార్ అవార్డు గ్రహీత కూడా.1924 లో చికాగో లో పుట్టిన జీన్ డీచ్ 1959 నుండి చెక్ రిపబ్లిక్ లోని చెకోస్లేవేకియా లో స్థిరపడ్డారు.చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ లో ఏప్రిల్ 19న ఆయన మృతి చెందారు.డచ్ గత కొంత కాలంగా ప్రేగు సంబంధిత వ్యాధి తో బాధపడుతున్నారు.1960లోనే యానిమేషన్ సినిమా లకు గాను అకాడమి అవార్డు ను అందుకున్నారు డీచ్..1940 లో మొదలైన టామ్ అండ్ జెర్రీ షో ఈ తరం లో కూడా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ అలరించడమే కాక,ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టక పోవడం ఆ షో గొప్పతనం.అంతకన్నా ముఖ్యంగా దానిని అందంగా యానిమేట్ చేసిన డీచ్ వంటి గొప్ప యానిమేటర్లు, దర్శకుల ప్రతిభే దానికి కారణం.