జులై లోనే టాక్ జగదీష్

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ టాక్ జగదీశ్. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో నాని తో నిన్నుకోరి సినిమా తీసి దర్శకుడుగా అరంగేట్రం చేసిన శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ఇది. జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ కొన్నేళ్ల క్రితం శోభన్ బాబు, రాజ శేఖర్ హీరోలుగా వచ్చిన బలరామ కృష్ణులు కథను పోలి ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. శోభన్ బాబు పాత్రను పోలిన కారెక్టర్ లోనే జగపతి నటిస్తున్నాడు అంటున్నారు. అలాగని పూర్తిగా బలరామ కృష్ణులు కథ కూడా కాదట.
ప్రస్తుతం టాక్ జగదీశ్ షూటింగ్ గోదారి జిల్లాల్లో జరుగుతోంది. అక్కడ ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారట. అది పూర్తి కాగానే నాని వి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటాడు. ఐతే ఈ జగదీశ్ షూటింగ్ ఇప్పటికే మేజర్ పార్ట్ పూర్తి అయ్యిందట. అందువల్ల ఈ ఏడాది జులై లోనే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఎందుకంటె నాని ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. జగదీశ్ పూర్తి ఐన వెంటనే శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ కు వెళ్తాడు. మోతంగా మూడు నెలల గ్యాప్ లో నాని రెండు సినిమాలతో కనిపించే బోతున్నాడు.

Related Articles

Back to top button
Send this to a friend